ఈ రోజుల్లో చాలా మంది సిగరెట్ మందు తాగుతూ, ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. కానీ తర్వాత జరిగే పరిణామాలను వాళ్ళు పట్టించుకోవడం లేదు,

ప్రతి సంవత్సరం కేవలం మద్యం తాగడం వల్ల సుమారుగా 30 లక్షల మంది చనిపోతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సమస్యలకు ఐదు శాతం కారణం ఈ మందే. ఆరోగ్యపరంగా కాకపోయినా ఈ మద్యం తాగే వాళ్ల వల్ల ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయో మనం చూస్తున్నాం.

అయితే అసలు ఈ ఆల్కహాల్ లోపలికి వెళ్ళిన తర్వాత మన బాడీ లోపల ఏం జరుగుతుంది, తాగిన తర్వాత వచ్చే హ్యాంగోవర్ అంటే ఏమిటి, ఎందుకు ఇది అలవాటుగా మారిపోతుంది. ఈ ఆల్కహాల్ అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలా ఆల్కహాల్ కనెక్షన్ గురించి పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మన బాడీలో ఏం జరుగుతుందనేది చూద్దాం.

ఆల్కహాల్ తాగిన తర్వాత అది జీర్ణశయంలోకి ఎంటర్ అవుతుంది. ఒకవేళ కడుపులో ఎటువంటి ఆహారం లేకుండా, ఖాళీగా ఉంటే అది అక్కడి నుండి వెంటనే చిన్న ప్రేగుల్లోకి వెళుతుంది. ఈ చిన్న ప్రేగుల్లో ఉండే గోడల ద్వారా ఈ ఆల్కహాల్ రక్తంలో కలుస్తుంది. అదే ఒకవేళ మందు తాగుతున్నప్పుడు ఫుడ్డు కూడా తింటూ ఉంటే, ఈ ఆల్కహాల్ ఫుడ్ తో పాటు కలిసి చాలా మంది సేపు జీర్ణశయంలోనే ఉండిపోయి, కొద్ది కొద్దిగా ఆహారంతో పాటు చిన్న పేగులోకి వెళుతుంది.

దీనివల్ల ఆల్కహాల్ చాలా స్లోగా రక్తం లో కలుస్తుంది. అయితే ఈ ఆల్కహాల్ ని చిన్న పేగులు గాని అరిగించలేవు, కాబట్టి చిన్న పేగుల వద్ద డైరెక్ట్గా ఈ ఆల్కహాల్ రక్తంలో కలిసిపోయి అక్కడి నుండి మన బాడీలోని అన్ని పార్ట్స్ కి చేరుకుంటుంది. ముందుగా ముఖ్యమైన భాగాలైనటువంటి లివర్ అండ్ బ్రెయిన్ కి చేరుకుంటుంది. మనం ఏదైనా ఆహారం తిన్న తర్వాత మన జీర్ణాశయంలో జీర్ణం అయ్యే అపోషకాలు రక్తంలో కలుస్తాయి. అక్కడి నుండి అవి లివర్ కి చేరుకుంటాయి అప్పుడు లివర్లో ఉండే ఎంజైమ్స్ ఇన్ న్యూట్రియన్స్ ని బ్రేక్ డౌన్ చేసి ఏవైనా టాక్సిన్స్ ఉంటే, వాటిని క్రాస్ చేసి టాక్సిన్స్ ని బయటికి పంపిస్తుంది. అలాగే మనం తీసుకున్న ఆల్కహాల్ కూడా రక్తం ద్వారా లివర్కే చేరుకుంటుంది. అప్పుడు లివర్ లోనే ఎంజాయ్ ఆల్కహాల్ ని బ్రేక్ చేస్తాయి ముందుగా, ఏ డి హెచ్ ఎం అనే ఎంజైమ్ ఆల్కహాల్ ని అసిటాల్డా హైడ్ గా మారుస్తుంది. ఇది ఒక రకమైన టాక్సన్. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..