ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లాకు చెందిన ఆడపడుచు, ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో నియమించారు. అపాయింట్మెంట్ ఆఫ్ క్యాబినెట్ సెలక్షన్ కమిటీ ఆమెను పిఎంలో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్ అగ్రహారం. గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి పద్మావతి లకు ఆమె మొదటి సంతానం.

అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్లో 2010 ఐఏఎస్ బ్యాచ్ చెందిన అధికారినిగా విధులలో చేరారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం పీఎం లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నారు. అతి చిన్న వయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు.

ఈ పోస్ట్ లో ఆమె మూడేళ్ల పాటు వీధులు నిర్వహిస్తారు. ఆమ్రపాలి ఇప్పటివరకు కేంద్ర క్యాబినెట్ సెక్రెటరీ డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఐఏఎస్ కి ఎంపికైన తర్వాత 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా మొదట విధులలో చేరారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు. ఆమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్ గా కూడా పనిచేశారు.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఎన్నికలలో జాయింట్ సీఈవోగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి g కిషన్ వద్ద ప్రైవేట్ సెక్రటరీగా కూడా విధులు నిర్వహించారు. ప్రస్తుతం పీఎంఓ లో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమ్రపాలని తన నిబద్ధతగల పనితీరుతో సంచలనాల కలెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆమె తండ్రి కాటా వెంకట్రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాసగృహం n అగ్రహారంలో ఇప్పటికే ఉంది. ప్రస్తుతం అదే శిథిలావస్థకు చేరుకుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.