వేసవి కాలంలో మామిడి పండ్లతో పాటు ఇతర కొన్ని పండ్లు కూడా కాస్తాయి. అందులో చెప్పుకోదగ్గది మల్బరీ పండ్లు. వీటి గురించి పెద్దగా అందరికీ తెలియదు. ఈ పండ్లు చూడానికి చాలా చిన్నగా ఉంటాయి. అంతే కాకుండా ఎరుపు, నలుపు లేదా ఊదారంగులో ఎక్కువగా కాస్తుంటాయి.

అయితే ఈ పండ్లు ఎక్కడ పడితే అక్కడ కాయవు. కానీ ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. రుచితో పాటు వీటిని తింటే చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది..మల్బరీ పండ్లను తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సాయం చేస్తుంది. దాంతో పాటు ఇందులో పాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు దోహదం చేస్తుంటాయి. కాబట్టి ఎండాకాలంలో మల్బరీ పండ్లను తింటే సీజనల్ ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు సాయం చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

బరువు తగ్గుదల..మల్బరీ పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది బరువును తగ్గించడంలో సాయం చేస్తుందని చెప్పుకోవాలి. వీటిని తినడం వల్ల పదే పదే ఆకలి వేసే బాధ తప్పుతుంది. కాబట్టి అతిగా తినకుండా ఉంటారు. కాబట్టి కేలరీలు తగ్గిపోయి ఈజీగా బరువు తగ్గుతారు.ఎముకలకు మేలు..ఎముకలు బలంగా మారేందుకు ఇది సాయం చేస్తుంది. ఇందులో ఇనుము, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎముకలు ధృఢంగా ఉండేందుకు ఈ పండ్లు సాయం చేస్తుంటాయి.

గుండెకు ప్రయోజనకరం..ఈ చిన్న పండ్లను తింటే గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గుండెలో ఉండే కొలెస్ట్రాల్ ను వీలైనంత వరకు తగ్గించేందుకు సాయం చేస్తుంది. అంతే కాకుండా గుండె, ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుందని చెప్పుకోవాలి. గుండెపోటు, అథెరోస్క్లెరోసిస్, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.రక్తంలో షుగర్ కంట్రోల్..ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ లో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది. అంతే కాకుండా బ్లడ్ లో షుగర్ ను నెమ్మదిగా విడుల చేసేందుకు ఈ పండ్లు సాయం చేస్తాయి. అంతే కాకుండా దాన్ని చిరుతిండిగా కూడా తినొచ్చు.జీర్ణక్రియ ఆరోగ్యంగా..మల్బరీలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది కడుపులో ప్రేగులు ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రేగుల గుండా ఆహారం ఈజీగా కదిలేందుకు సాయం చేస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం సమస్య ఉండదు.