ఉన్నట్టుండి హాస్టల్లో పెద్ద పెద్దగా అరిచాడు. దాంతో తోటీ స్నేహితులు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లారు ఇంటికి వచ్చిన తర్వాత పూనకం వచ్చినట్టు ప్రవర్తించాడు. ఈ వ్యవహారం తెలుసుకున్న గ్రామస్తులు నిజంగానే బాలుడికి దేవుడు ఆవహించాడని నమ్మారు.

ఆ తర్వాత పండు స్వామిగా ఫేమస్ అయిపోయాడు. ఉపేందర్ నవదీప్ అనే విద్యార్థి ఏకంగా తన వ్యవసాయ పొలంలో ఉన్న గుట్ట దగ్గర దేవుడు వెలిశాడని చెప్పాడు. అక్కడున్న బండరాళ్ల దగ్గర పూజలు చేయడం మొదలుపెట్టారు. ప్రతిరోజు పంది స్వామి అక్కడికి వెళ్లి పూజలు చేసేవాడు.

ఈ విషయం ఆ నోట ఈ నోట విన్న జనం గుట్టపై ఉన్న ప్రాంతాన్ని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. ఈ వ్యవహారం తెలుసుకున్న కోదాడకు చెందిన జగన్నాథ్ అని ఒక పెద్ద మనిషి తొలత పండు స్వామిని కలిశాడు. ఆయనని కలిసిన తర్వాత అమెరికాలో ఉన్న తన మనవడికి మాటలు వచ్చాయని చెప్పుకు వచ్చాడు.

ఈ విషయాన్ని గ్రామస్తులు కూడా నమ్మారు. దాంతో దేవుడు వెలిసిన ప్రాంతంలో తాను గుడిని కడతానంటూ ముందుకు వచ్చాడు జగన్నాథ్. విరాళాలు కూడా సేకరించారు. మొదట్లో నాగమణి పండుగ స్వామి దేవుడమ్మ జగన్నాథ్ అంతా కలిసే పని చేశారు. కానీ రోజురోజుకీ భక్తుల తాకిడి పెరుగుతుండడంతో ఈ ముగ్గురిని పక్కన పెట్టేసాడు జగన్నాథ్. స్వామి వెలిశాడని తానే చెప్పానని ఒకరు తాము వెలికి తీశామని, ఇంకొకరు గుడి కడతానని ముందుకు వచ్చింది మరొకరు.

ఇప్పుడు మీరు మధ్య ఆదిపత్య పోరు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ ఆలయానికి గ్రామస్తులతో కలిపి ఒక పాలకమండల్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ కమిటీలో గుడి చైర్మన్ తనకు కావలసిన వారికి తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే, కమిటీలో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఆలయానికి 7 నెలల నుంచి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న వాటి లెక్కలు ఎవరికి తెలియవు. దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో వారికి తప్ప మరొకరికి తెలియదు అంటున్నారు స్థానికులు. తోటి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.