కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు కదా, నిజంగానే అక్షర సత్యం. కేవలం కష్టాన్ని నమ్ముకున్నా ఒక మహిళ తినడానికి తిండి లేని స్థాయి నుండి,

కోట్లు సంపాదించే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఆమె పేరు కృష్ణ యాదవ్ ఈమె భర్త కారు రిపేరు చేసేవాడు, కానీ ఆ వ్యాపారం కలిసి రాలేదు. దీంతో తన కుటుంబాన్ని పోషిస్తానని భర్త గోవర్ధన్ సింగ్ ఒక్కడే ఢిల్లీకి వచ్చాడు. కానీ ఏమీ సంపాదించలేకపోయాడు.

తన ఖర్చులకు సరిపడా కూలి మాత్రమే దొరికేది. దీంతో గ్రామంలో ఉన్న భార్య ముగ్గురు పిల్లలకు ఏమీ పంపలేకపోయేవాడు. దీంతో ఇక ఇక్కడే ఉంటే బతకడం కష్టమవుతుందని, తన దగ్గర బంధువుల కాళ్లు పట్టుకొని ఒక 500 రూపాయలు అప్పుగా తీసుకొని, ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీకి వచ్చింది. ఆమె అప్పటికే నెలకు ₹1000 అద్దెతో ఒక చిన్న రూమ్ ని అద్దెకు తీసుకున్నాడు భర్త. ఇక పిల్లలను కనీసం ప్రభుత్వ స్కూల్లోనైనా చదివిస్తూ బతుకుచులే అనుకున్నారు.

కృష్ణ యాదవ్కి చదువు లేదు, ఆమె భర్తకి కనీసం చదవడం రాయడం వచ్చు. అందుకే పిల్లలు మాత్రం చదువుకోవాలనే తపన ఇద్దరికీ ఉండేది, ఇళ్లల్లో పాచి పనులు చేసేది కృష్ణ యాదవ్ భర్త కూడా ఏదో పనికి వెళ్లేవాడు. అయితే ఆమెకు తెలిసిన వారికి దగ్గరలో కొంత భూమి ఉందని తెలిసి లీజుకు తీసుకొని, కూరగాయలు పండించారు భర్తతో కలిసి ఆమె రోడ్డు మీద కూరగాయలు అమ్మేవారు. అందులో కూడా పెద్దగా ఏమీ మిగిలేది కాదు, శ్రమ కూడా మిగలడం లేదని వాపోయారు.

ఆమె దీంతో భర్త మళ్ళీ చిన్నచిన్న కూలి పనులకు వెళ్లేవాడు, కుటుంబం గడవడానికి పాచి పనులు చేస్తూ ఉండేది కృష్ణ యాదవ్. అయితే ఒక రోజున దూరదర్శన్ లో కృషి దర్శనాన్ని ప్రోగ్రాం వస్తుంది, ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వారికి ప్రభుత్వమే ప్రోత్సాహం ఇస్తుంది అనేది ఆ ప్రోగ్రాం సారాంశం. అంతే కాదు ఆర్థిక సహాయం కూడా చేస్తుందని అధికారులు వివరించారు. అంతే మరుసటి రోజు పని మానేసి కృషి విజ్ఞాన కేంద్రం దగ్గరికి వెళ్లారు. ఆమె మొదట ఎవరిని కలవాలో అర్థం కాలేదు. అయినా తన మనసులోని కోరిక చెప్పారు దీంతో అధికారి కృష్ణ యాదవ్ ఆసక్తిని గమనించింది, కొత్తగా పచ్చళ్ళ తయారీపై శిక్షణ ఇచ్చే బ్యాచ్ మొదలైంది జాయిన్ అవుతారా అని అడిగింది ఆమె కృష్ణ యాదవ్ సరేనంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..