ఫైవ్ స్టార్ హోటల్స్ లలో వెళ్లి వెళ్ళగానే ఇచ్చే వెల్కమ్ డ్రింకులను పరిశుభ్రమైన గ్లాసులో ఇస్తారని మీరు అనుకుంటున్నారా? అలా అనుకున్నట్లయితే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఇటీవల హోటల్స్ పై నిర్వహించిన ఓ సర్వేలో వెలుగు చూసిన కొన్ని నిజాలను పరిశీలిస్తే, హోటల్స్లో శుభ్రత ఎంతగా ఉంటాయో అర్థమవుతుంది. మెరిసేదంతా బంగారం కానట్లే, పైకి మంచి క్యాప్షన్ లు పెద్ద పేరు ఉన్నంత మాత్రాన హోటల్స్లో ప్రతిదీ శుభ్రంగా ఉంచుతారు అనుకోవడం పొరపాటు. ఈ నేపథ్యంలో ఆ సర్వేలో హోటల్స్ గురించి వెలుగు చూసిన కొన్ని షాకింగ్ విషయాలను ఇప్పుడు చూద్దాం…

మన దేశంలోని చాలా ఫైవ్ స్టార్ హోటల్స్ లో వెళ్ళి వెళ్ళగానే అతిథులకు ఒక వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. సీక్రెట్ గా నిర్వహించిన ఒక సర్వేలో ఈ డ్రింకులను సర్వ్ చేసే గ్లాసులను కనీసం కడగడం కూడా లేదు అని ఒకరు తాగిన తర్వాత, ఆ గాజు గ్లాస్ ని కేవలం ఒక క్లాత్ శుభ్రం చేసి తర్వాత అతిథికి సర్వ్ చేస్తున్నారు అని తెలిసింది. అసలే వైరస్ గురించిన ప్రమాదాలు చుట్టూ పొంచి ఉన్న ఈ సమయంలో ఈ తరహా నిర్లక్ష్యం మరింత ప్రమాదాలను కొని తెస్తాయి. కేవలం వైరస్ మాత్రమే కాదు రకరకాల బ్యాక్టీరియా, ఫంగస్లు కూడా ఈ రకంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కేవలం లాలాజలం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధులు చాలా ఉన్నాయి. ఇక హోటల్స్లో అతిథులకు అందించే టవల్స్ విషయంలో కూడా ఏమాత్రం పరిశుభ్రత పాటించరని కొన్ని హోటల్స్లో అయితే ఏకంగా టాయ్లెట్లు శుభ్రంచేసిన టవల్స్ ను అతిధులకు అందిస్తున్నట్లు గా తెలిసింది.

చాలాసార్లు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ లో చెక్ అవుట్ చేసేటప్పుడు ఇచ్చే బిల్లులో, బిల్లుతోపాటు టాక్స్ రూపంలో మరి కొంత మొత్తాన్ని కలిపి చూపిస్తారు. ఎవరైనా తెలిసిన వ్యక్తి జాగ్రత్తగా గమనించి అడిగితే తప్ప దాని గురించి వారు ఏమీ చెప్పరు. ఒకవేళ ఎవరైనా అడిగిన సందర్భంలో సారీ చెప్పి ఆ అమౌంట్ తగ్గిస్తారు. ఈ మధ్య ఇటువంటి రకమైన మోసాలు హోటల్స్లో ఎక్కువగా జరుగుతున్నాయని కంప్లైంట్ లు వస్తున్నాయి.