మగ పిల్లల కానీ ఆడపిల్లలకు గాని వయసులో ఉన్నప్పుడు వచ్చే మొటిమలు నేచురల్ గా తగ్గాలి. ఆ భాగంలో మొటిమ పోయిన తర్వాత మళ్లీ స్కిన్ ఒరిజినల్ గా రావాలి మచ్చ లేకుండా పోవాలి అని కోరుకుంటే, దీని వరకు రకరకాల మందులు ఆయింట్మెంట్లు క్రీములు వాడుతూ ఉంటారు.

కానీ ఇలాంటి అవసరం రాకుండా నేచురల్ గా లోపల నుండి మొటిమలు తగ్గడానికి ఆ మొటిమ భాగంలో పడ్డ మచ్చ పోవడానికి, ఒరిజినల్ స్కిన్ మళ్ళీ రావడానికి నాచురల్ గా మనం ఏమి చేస్తే మంచిది అని, అలాంటి వయసులో ఉన్న పిల్లలు సౌందర్యాన్ని ముఖ్యంగా

ముఖ భాగంలో పెంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని విషయాలని మీ అందరికీ అందించబోతున్నాను. మొట్టమొదటిది ఈ మొటిమలు వచ్చిన దగ్గర పిల్లలందరికీ ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏమిటి అంటే అది పైకి కనపడుతుంది. లావుగా బొడిపలాగా అందుకని అలా ఉంటే మన చూపు దాని మీదికే వెళుతుంది. ఎదుటి వాళ్ళ చూపు కూడా ఆ బొడత మీదికే వెళుతూ ఉంటుంది.

అందుకనే దాన్ని త్వరగా నొక్కేసి గిల్లేసి పిండేస్తే ఆ ఉబ్బెత్తు అంతా కూడా లోపల పసరు రూపంలో బయటికి వచ్చేసి ఏమీ తెలియదు అన్నట్టు నొక్కి గిల్లి పిండేస్తూ ఉంటారు. గిల్లటం అనేది అలవాటు మీరు మానుకోకపోతే, ఈ స్కిన్ లో ఆ భాగంలో గుంటలు పడుతూ ఉంటాయి.

అలా పిండడం వల్ల అదే మొటిమ అనేది కాస్త మెచ్యూర్ అయ్యి, ఒకటి రెండు రోజుల్లో దానంతట అదే పగిలి దానంతట అదే లోపల ఉన్న వేస్ట్ ని బయటకి క్లీన్ చేసుకుంటే గుంట పడదు. ఈలోపే అది రెడీ అవ్వకముందే మీరు దాన్ని బలవంతంగా నొక్కిపిండారు అనుకోండి, అక్కడ మల్ల రికవరీ అవ్వడం సరిగా జరగక, హీలింగ్ సరిగ్గా జరగక నొప్పి పిండడం వల్ల, గాలిలో ఉండే క్రిములు అక్కడికి వెళ్లి ఇంట్లో మిషన్ కలిగి మచ్చపడడం జరుగుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.