మన శరీరంలో దంతాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే దంతాల పట్ల మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దంత సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తాయి.

ముఖ్యంగా మన ఆరోగ్య సమస్యల్లో అత్యంత బాధాకరమైన సమస్య, దంత సమస్య. ఒకసారి దంత సమస్యలు మొదలైతే ఎన్నో రకాలుగా ఇవి బాధిస్తూ ఉంటాయి. అలాగే మన ముఖం, అందం లో కూడా ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

మీరు ఎంత అందంగా ఉన్నా దంతాలు గార పట్టి, పాచి పట్టి, ఎల్లో కలర్ లో కనిపిస్తుంటే చూడటానికి అందంగా కనిపించవు.అలాగే ఇక మీ దంతాలు వదులు అయితే ఆనందంతో, పాటు ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఎందుకంటే మన ఆరోగ్యం కోసం మనం ఆహారం నమిలి తినాలంటే మనకు దంతాలు చాలా అవసరం. మరి దంతాలు వదులు అవ్వటానికి కారణం మన నోట్లో ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్.

వీటి కారణంగా మన దంతాలు వదులవుతాయి, కాబట్టి ఇక ముందు మీ దంతాలు వదులు కాకుండా స్ట్రాంగ్గా ఉండటానికి అలాగే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి, మన పంటిపై ఉండే గారను తొలగించి, మన దంతాలు తెల్లగా మెరిసేలా చేసే ఒక మంచి ఎఫెక్టివ్ హోం రెమడీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ముందుగా దంతాలపై పేరుకున్న గారను తొలగించే హోమ్ మేడ్ టూత్ పేస్ట్ గురించి తెలుసుకుందాము.. దీనికోసం ముందుగా మీరు ఒక బౌల్ తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఆవనూనె. మీరు శుద్ధమైన ఆవ నూనెను తీసుకొని ఒక స్పూన్ మోతాదులో ఈ బౌల్ లో యాడ్ చేయండి. మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.