ప్రాణ స్నేహితుడు అని నమ్మి సహాయం కోరితే, ఏకంగా డబ్బు కోసం కుటుంబం మొత్తాన్ని విడతల వారీగా చంపిన ఒక దుర్మార్గుడు. మొత్తం 16 రోజుల్లో మూడు రోజులపాటు ఒక్కొక్కరిని చంపాడు.

ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో జరిగిన ఈ సంచలన హత్యలు పెను దుమారం లేపుతున్నాయి. ఒక హత్య కేసులో విచారణ మొదలు పెట్టగా మొత్తం ఈ దారనాలు బయటపడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్ భూపాల్ పల్లి గ్రామం దగ్గర ఒక గుర్తు తెలియని మృతదేహం ఉందని, పోలీసులకు సమాచారం అందింది.

ఈ నెల 13న పూర్తిగా కాలిపోయిన మృతి దేహం చూసిన పోలీసులు అనుమానించారు. బయట ప్రాంతం నుంచి తీసుకువచ్చి హత్య చేసి ఉంటారని అనుమానించారు. దీంతో సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా హత్య చేసింది ప్రశాంత్ అని గుర్తించారు. ఆ దిశగా విచారణ చేపట్టారు, పోలీసులు అప్పుడే పోలీసులకి ఒళ్ళు గగుర్లు పొడిచే విషయాలు తెలిసాయి.

బాధిత ఫ్యామిలీలో కేవలం 16 రోజుల గ్యాప్లో ఐదుగురు అప్పటికే చనిపోయారు, అని తేలడంతో పోలీసులు షాక్ అయిపోయారు. దీంతో ఒక్కో హత్యను లింకు చేసుకుంటూ వెళ్లారు పోలీసులు, ఒకే ఫ్యామిలీని ఎంత చాకచక్యంగా ఇలా హత్య చేశాడు. నిందితుడు ప్రశాంత్ ను తొక్క తీస్తే అసలు విషయం చెప్పాడు, మరి మొత్తం కుటుంబాన్ని అసలు ఎందుకు చంపాడు, ఈ హత్యల వెనుక ఒక దారుణమైన కథ ఉంది. చిన్నపిల్లల్ని కూడా వదల్లేడు ప్రశాంత్.

హంతకుడు ప్రశాంత్ కి ప్రాణ స్నేహితుడు మృతుడు ప్రసాద్, ఉమ్మడి నిజామాబాద్ లోని మక్కువ ఉండేవాడు ప్రసాద్. అయితే ఒక యువతి ఆత్మహత్యకు కారణం అయ్యాడని ప్రసాద్ ను గ్రామస్తులు బహిష్కరించారు. గ్రామ బహిష్కరణ విధించడంతో గ్రామంలోని రెండెకరాల వ్యవసాయ భూమిలో, ఎకరం అమ్మేసి దుబాయ్ వెళ్లిపోయాడు. ఇక అతడికి ఉన్న రెండిల్లు కూడా మకులూరు లోనే ఉన్నాయి. ఇక దుబాయిలో కొద్దిరోజుల పాటు డబ్బు సంపాదించుకొని వచ్చాడు. ప్రసాద్ దుబాయ్ నుంచి రాగానే పాత కేసులో పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..