2020 వ సంవత్సరం పేద ప్రజలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఒక శాపంగా మారిందనే చెప్పాలి. ఈ మహమ్మారి దాటికి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, కొంతమంది ఈ లక్డౌన్ వాళ్ళ పూత గడవక ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకుడు తన జేబులో నుండి ఒక రూపాయి బయటకు తీసి ప్రజలను ఆదుకునేందుకు సహాయపడక పోగా, తమని వెండితెర మీద దేవుళ్లు గా భావించి ఇంత పెద్ద వాళ్ళను చేసిన జనాలు కోసం సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేశారు, వారిలో సోనూసూద్ ఎలాంటి జనాలకు ఎలాంటి సేవలు అందించాడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పేద ప్రజల కోసం ఆయన తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టి ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కొన్ని వేల మందికి సహాయం చేశారు.

ఆయన లాగానే ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కూడా ఇలా సేవా కార్యక్రమాలు చేసింది. ఆ క్రమంలో దురదృష్టం కొద్దీ పక్షవాతంతో ప్రాణాల మీదికి తెచ్చుకుని ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఆమె ఎవరంటే బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో పాన్ అనే సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ శిఖా మల్హోత్రా. ఇప్పుడు ఇప్పుడే బాలీవుడ్లో వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతున్న నటి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఈమె పేద ప్రజల కోసం రోడ్ల మీదకు వచ్చి సుమారు ఆరు నెలల పాటు విరామం లేకుండా సేవ చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. అలా సేవ చేస్తున్న సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి పక్షవాతానికి గురయ్యారు. ఆ తర్వాత మెరుగైన వైద్యంతో మెల్లగా కోలుకున్న ఆయన మళ్లీ చురుగ్గా పాల్గొనడం మొదలు పెట్టారు. ఈమె చేస్తున్న సేవా కార్యక్రమాలకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి తరచూ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంటుంది.

అయితే ఈ సేవా కార్యక్రమాలతో తీవ్రమైన ఒత్తిడికి లోనై మరోసారి పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు ఏమైనా పర్వాలేదు నలుగురికి సహాయపడాలి అనే గొప్ప మనసు ఉన్న శిఖా మల్హోత్రా త్వరగా ఆపరేషన్ నుండి కోలుకొని మన ముందుకు రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం ప్రార్థనలు చేద్దాం. కోట్లకు పడగలెత్తిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మరియు రాజకీయ నాయకులు తమ స్వార్థం చూసుకొని జేబులో నుంచి చిల్లిగవ్వ కూడా తీసి సహాయం చేయని మనషులు ఉన్న ఈ లోకంలో తాము సంపాదించిన దాంట్లో ఎంతోకొంత నలుగురికి ఉపయోగపడాలి పరితపించే శిఖా మల్హోత్రా వారు మన సమాజంలో ఉండటం నిజంగా మనం చేసుకున్న అదృష్టం అని చెప్పాలి.

ఒకపక్క సోనూసూద్ అలాంటివారు తాము సంపాదించిన ఆస్తులు అమ్ముకొని అయినా ఒకరికి సహాయ పడాలి అనే గొప్ప మనసుతో ముందుకు వస్తూ ఉంటే మరో పక్క ప్రజాసేవ కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని శిఖా మల్హోత్రా వంటి వారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కొన్ని కోట్ల మంది భారతీయులకు ఆదర్శంగా నిలిచారని చెప్పాలి. మంచి వాళ్లకి ఎప్పుడూ కఠినమైన పరీక్షలు ఎదురవుతుంటాయి అని పెద్దలు చెప్పిన మాటలను నిజం చేస్తూ ఈ రోజు శిఖా మల్హోత్రా ఈ స్థితిలో ఉండటం యావత్ భారత దేశ ప్రజలు గుర్తిస్తున్నారు. కోట్లాది మంది జనాల ప్రార్థనలు ఆమెను చల్లగా చూసి అతి త్వరలోనే మన ముందుకు రావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.