టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో బ్యాచిలర్ లైఫ్ కి పుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్, వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది. ఇక ఎప్పుడూ మరో హీరో మరో ఇంటి వాడయ్యాడు.

దగ్గుపాటి సురేష్ కుమార్ చిన్న కుమారుడు హీరో దగ్గుపాటి అభిరామ్, దగ్గర బంధువు వరుసకు మరదలైన ప్రత్యూషతో ఏడడుగులు నడిచారు. డిసెంబర్ 6న శ్రీలంకలో జరిగిన ఈ డిస్టినేషన్ వెడ్డింగ్ కి, ఇది కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు హాజరయ్యారు.

తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోసు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు మూడు రోజులపాటు వీరి పెళ్లి వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. అభిరామ్ సతీమణి ప్రత్యూష స్వస్థలం కారం చలాని తెలుస్తోంది. దగ్గుబాటి సురేష్ బాబు కి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు రానా దగ్గుపాటి, కాక చిన్న కుమారుడు అభిరామ్ దగ్గుపాటి, లీడర్ సినిమాతో హీరోగా తెలుగు సినిమాకి పరిచయమయ్యాడు.

రానా ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి హీరోగా ప్రశంసలు అందుకున్నారు. గతంలో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో బల్లాలదేవ పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించారు. ఇందులో పూర్తిగా విలనిజంతో అదరగొట్టేశారు. ఇక అభిరామ్ విషయానికి వస్తే ఇటీవల అహింస సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో తొలి సినిమాని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దీంతో కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలో చేయనున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంకలోని కలుతర పట్టణంలో అనంతరం, కలుతర రిసార్ట్స్ లో నిన్న రాత్రి 1:50 నిమిషాలకు అభిరామ్ దగ్గుపాటి ప్రత్యూష వివాహం ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. సముద్రం మధ్యలో ఉండే ఈ రిసార్ట్ లో వీరి పెళ్లి జరిగింది. పెళ్లికూతురు ప్రత్యక్ష అభిరం చిన్న తాత కూతురికి కూతురే కావడంతో, వరసకు మరదలు అవుతుంది. ఇటీవల అభిరామ్ ప్రత్యూష నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ విషయం మాత్రం బయటికి రాలేదు. హైదరాబాద్లో హల్దీ మెహేంది వేడుకలు నిర్వహించారని కేవలం పెళ్లి తంతు మాత్రం, శ్రీలంకలో లగ్జరీ రిసార్ట్ లో జరిగినట్లు తెలుస్తోంది. వీరి పెళ్ళికి దాదాపు 200 మంది హాజరైనట్టు తెలుస్తుంది. అలాగే వచ్చే ఏడాదిలో వెంకటేష్ చిన్న కూతురు, హవ్యవాహిని వివాహం కూడా జరగనుంది. ఇది వలే ఆమె నిశ్చితార్థం జరగగ మహేష్ బాబు చిరంజీవి కూడా నిశ్చితార్థానికి వెళ్లారు.

https://youtu.be/HTtdf5wIRtE