మార్గశిర పాడ్యమి రోజు ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకున్నాo, కార్తీకమాసం మొత్తం దీపారాధన చేయడం ఒక ఎత్తు, అయితే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు దీపారాధన చేయటం మరొక ఎత్తు.

దాన్ని ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. కార్తీకమాసం మొత్తం అన్ని రోజులు దీపారాధన చేయలేని వారు, ఈ ఒక్కరోజు తులసి కోట వద్ద దీపముంచిన, లేదా నీటిలో దీపాలను వదిలిన ఆ నెల రోజులు పూజ చేసిన ఫలితం వస్తుంది.

అయితే ఈరోజు ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాడ్యమి రోజు బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి ముందుగా, ఇంటిని శుభ్రం చేసి తల స్నానం చేసి, సుచి అయిన ను ధరించి, ఆకాశంలో ఉన్న కృతిక నక్షత్రాలను దర్శనం చేసుకుని, ఆ తరువాత తులసి కోట వద్ద శుభ్రం చేసి, ముగ్గు వేసి పూజకు కావలసిన సామాగ్రి సిద్ధం చేసుకోవాలి.

పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె అరటి డొప్పలు 31 వత్తులు, పువ్వులు కొబ్బరికాయ, అరటి పళ్ళు తమలపాకులు, పాలక చలిమిడి వడపప్పు సిద్ధం చేసుకోవాలి. తులసి కోట వద్ద పద్మం శంకు విష్ణు చక్రాల ముగ్గురు వేసుకోవాలి. తర్వాత తులసి కోట వద్ద అలాగే తులసి కోట ముందు పీట ఏర్పాటు చేసి పసుపు రాసి, కుంకుమ బొట్లు బియ్యప్పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఆ తరువాత శివపార్వతుల ఫోటోలు సిద్ధం చేసుకోవాలి.

లేదా వెంకటేశ్వర స్వామి ఫోటోలు సిద్ధం చేసుకోండి, చక్కగా దేవుడి ఫోటోలకు గంధమధ్య కుంకుమ పెట్టి పూలతో అలంకరించి, ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి అక్షంతలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు రెండు తమలపాకులను ఆశలపై నుంచి దానిమీద పసుపుతో చేసిన గౌరీదేవిని గంధం కుంకుమలు, సమర్పించి పూజించుకోవాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.