బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులు ఇందులో లయకారకుడైన పరమేశ్వరుడు అనే విషయం మనకు తెలిసిందే. మన దేశం ఆధ్యాత్మికతకు నెలవు ఇక్కడ ఎన్నో పుణ్య క్షేత్రాలు కొలువై ఉన్నాయి. అందులో ఎక్కువగా మనకు కనిపించే దేవాలయాలు శివుడి వి ఎందుకంటే, మనకు పురాణాల ప్రకారం శివుడు మొదటి దేవుడు ఇక హిందువుల ఆరాధ్య దైవం కూడా శివుడు కావడం విశేషం.

శివం అంటే శుభం అని లింగం అంటే సంకేతం అని అర్థం మొత్తానికి శివలింగం అంటే శుభానికి సంకేతం. ఈ ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉన్నాయి. అందులో కొన్ని మనుషులు ప్రతిష్టించిన వి మరికొన్ని వాటంతట అవే వెలిసినవి, కానీ ఇప్పుడు మనం చూడబోయే శివలింగం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఎలాంటి విషయం మీరు ఇదివరకే విని ఉండరు చూసి ఉండరు. మరి ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటో తెలుసా ఈ శివలింగం కదులుతుంది. అదేంటి శివలింగం కదులుతున్న అని అనుకుంటున్నారా..! కానీ నిజం కావాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి. ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలోని రుద్ర పురం అనే గ్రామం అనేక కట్టడాలకు ప్రసిద్ధి, కానీ అందులో ప్రత్యేకత మాత్రం దుర్గేశ్వర నాధుని దేవాలయం ఎందుకంటే, ఇందులో కొలువైన శివుడు కడులుతుంటాడు ఇలా కదలడం మొదలు పెడితే ఒక్కోసారి గంట నుండి 24 గంటలు కదులుతుంది.

కానీ ఒక్కసారి ఆగి పోయిన తర్వాత ఎంత కదిపిన కదలదు, అదే ఇక్కడి ప్రత్యేకత చాలా దేవాలయాలలో శివలింగం లా పానమట్టం మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించబడింది. రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగం ఎన్నో సందర్భాలలో కదలడం చాలా ప్రత్యేకత. ఈ సంఘటనను చూడడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడికి ఈ చిత్రమైన సంఘటన ఎలాగైనా కనిపెట్టాలని శాస్త్రవేత్తలు శివలింగం చుట్టూ ఎంత తవ్విన దాని జాడ తెలియడం, లేదని దానితో ఇక్కడ సాక్షాత్తు పరమశివుడే వెలిశాడని భక్తుల నమ్మకం వీలు ఉంటే మీరు ఒకసారి చూసి రండి….