నిద్ర లేదా నిదుర (Sleep) ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలలో కూడా కనిపిస్తుంది.

మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని, నిద్ర పౌరుల ప్రాథమిక హక్కని, ఆరోగ్య జీవనానికి చాలా అవసరమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అవసరానుగుణంగా నిద్ర,నిశ్శబ్దం, విశ్రాంతి ఆరోగ్య రీత్యా మానవులకు తప్పనిసరి అవసరమని,నిశ్శబ్దం బంగారం లాంటిదని కోర్టు వ్యాఖ్యానించింది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల (2003) ఫలితంగా 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్థ్యం తగ్గినట్లుగా గుర్తించారు.

ఎన్ని గంటలు నిద్రపోవాలి:-సామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం. అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది.

అస్సలు నిద్రపోయేట్టపుడు ఎటువైపు తల పెట్టి నిద్రపోవాలి పై వీడియో లో చూసి తెలుసుకొండి .

వయసు రోజుకు కావలసిన సగటు నిద్ర:

  1. పురిటిబిడ్డ సుమారు 18 గంటలు
  2. 1–12 నెలలు 14–18 గంటలు
  3. 1–3 సంవత్సరాలు 12–15 గంటలు
  4. 3–5 సంవత్సరాలు 11–13 గంటలు
  5. 5–12 సంవత్సరాలు 9–11 గంటలు
  6. యువకులు 10 గంటలు
  7. పెద్దవారు 7–8 గంటలు
  8. గర్భణీ స్త్రీలు 8 (+) గంటలు

ప్రయోజనాలు :-

1 .నిద్ర వలన మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
2 .శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది.
3 .నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది.
4 .హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరుగుతుంది.
5 .నిద్ర తగ్గితే కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.