ఆయానీ మాస్టర్‌కు యాక్సిడెంట్ జరిగింది. అయితే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె పెను ప్రమాదం నుండి బయటపడింది. డ్యాన్స్ చేస్తూ పడిపోయింది.

ఈ ప్రమాదంలో ఆమె కాలు జారి పడిపోవడంతో గాయమైనట్లు తెలుస్తోంది. అయితే సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ప్రముక కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్. ముఖ్యంగా తన అసిస్టెంట్లతో కలిసి రీల్ వీడియోలు, డ్యాన్సులు చేస్తుంటుంది. వీటికి నెట్టింట బాగానే ఆదరణ వస్తుంటుంది.

అయితే తాజాగా ఓ రీల్ చేయాలని భావించిన యానీ మాస్టర్ ప్రమాదానికి గురైంది. వర్షంలో వెరైటీగా రీల్ చేసేందుకు ప్రయత్నించిన ఆమె పట్టు తప్పి కింద పడిపోయింది. దీంతో మాస్టర్ ముఖానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆందోళన చెందారు. యానీ మేడమ్ కు ఎలా ఉంది?

అని కామెంట్ సెక్షన్ వేదికగా ఆరా తీశారు. అయితే తాను క్షేమంగానే ఉన్నానని, ఎలాంటి గాయం కాలేదని యానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చింది.తన మీద ఇంత ప్రేమను చూపించిన అభిమానులకు చాలా థ్యాంక్స్ తెలిపిందామె. అయితే వర్షం సమయంలో ఇలాంటి రీల్స్ చేయద్దంటూ చాలా మంది ఆమెకు సూచనలు ఇచ్చారు. పలు హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన యానీ మాస్టర్ బిగ్ బాస్ లోనూ సందడి చేసింది.

బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని తనదైన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. అయితే 11వ వారంలోనే ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌లో కూడా ఓ క్యామియో రోల్ లో నటించింది యానీ మాస్టర్.

ప్రస్తుతం మహేష్ బాబు గారా పట్టి సితారకు డ్యాన్స్ మాస్టర్‌గా వ్యవహరిస్తోంది. క్లాసికల్ అండ్ వెస్ట్రన్ డ్యాన్స్ లలో తనకు ట్రైనింగ్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో సితారతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను కూడా నెట్టింట షేర్ చేస్తుంటుంది యానీ మాస్టర్. ఇక మెగా ఫ్యామిలీ ఇంట్లో జరిగే ప్రైవేట్ ఈవెంట్లకు కూడా యానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుంటుంది.