బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బలగాలపల్లిలో అచ్చమ్మ రెడ్డి గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ, రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి, రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావించారు

బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగాల పల్లెకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉంది. ఈ కొండ గుహలలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. అప్పట్లో కాబట్టి ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు.

ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనల విషయాలని ముందుగానే ప్రశ్నించి, వాటిని గుర్తించి వాటిని కాలపత్ర గ్రంధాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో రాసినవే, ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది వ్యక్తిగతంగా కూడా ఎన్నో మహిమలు చూపించాడు.

మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయలేమిటి కలయుగంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియచెప్పారు. అంతేకాకుండా చాలా బాగాన్నీ ఒకచోట పాతిపెట్టారు. ఆ తరువాత దానిపైన చింత చెట్టు మొలసింది.

ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనేదాన్ని ఇప్పటివరకు జవాబు అయితే దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం 40 రోజులు పాడపడుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 నుండి 1912 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో, కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులు ఎవరూ వెళ్లలేదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..