వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి గా భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా, పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి

మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా, ఇల్లు మొత్తం సుఖసంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మధనం సమయంలో, సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైంది కాబట్టి, ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావం వంతమైన నివారణలో ఒకటి.

రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్నచిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు, ఆధ్యాత్మిక పండితులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి.

ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడతపెట్టి, దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతోపాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇంటికి వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు, ఒకటి స్పూన్ రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక రాబడి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.