ఉసిరిని భారతీయ గూస్బెర్రీ అని కూడా పిలువబడుతుంది . ఈ చెట్టును హిందూమతంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు .ఇది ఆయుర్వేద వైద్యంలో అత్యంత ముఖ్యమైన ఆహారాలలో ఒకటి

మరియు ఇది మంచి ఆరోగ్యానికి నిదివంటిది .ఇది దానిమ్మ పండుకంటే 17రేట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్ శక్తిని కలిగి ఉంటుంది . ఈ చలికాలంలో ఆరోగ్యాంగా ఉండటానికి ఈ చవకైన అద్భుత పండును ఎండబెట్టి భోజనం తర్వాత రెండు ముక్కలు తీసుకోండి .

గొంతు నొప్పి మరియు జలుబును నయం చేస్తుంది :ఆమ్లా విటమిన్ సి యొక్క గొప్ప మూలం ,2టీస్పూన్ల ఉసిరి పొడిని 2టీస్పూన్ల తేనెతో కలపండి .తక్షణ మరియు ప్రభావవంతమైన ఫలితాల కోసం రోజుకు మూడు నుండి నాలుగు సార్లు తీసుకోండి .ఉసిరి కాయ మలబద్దకాన్ని తగ్గిస్తుంది :ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఉసిరి మలబద్దకం సమస్యను నివారిస్తుంది .

ఆమ్లా బాధాకరమైన నోటి పూతలను నయం చేయడంలో సహాయపడుతుంది :ఆమ్లా ద్రవరూపంలో తీసుకుంటే నోటి పండ్లను కూడా నయం చేసుకోవచ్చు . అరకప్పు నీటిలో ఆమ్లా రసాన్ని కలపండి ,తర్వాత గార్గ్ చేయండి .ఉసిరిలో ఆంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాలు ఉన్నాయి :ఆర్థరైటిస్ సంబంధిత నొప్పిని తగ్గించడంలో ఆమ్లా సహాయపడుతుంది . ఎండిన ఉసిరిని రోజు రొండు చొప్పున తినండి లేదా సీజన్లో తాజాగా మరియు పచ్చిగా అందుబాటులో ఉంటె తినండి . రెండు కూడా ఆరోగ్య రక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి .

మీ బరువు తగ్గించుకోవడాని మీరు కష్టపడుతున్నారా ?మీ ఆహారంలో ఉసిరిని చేర్చడం వలన అద్భుతంగా జీవక్రియలు మెరుగుపడుతాయి మరియు వేగవంతమైన జీవక్రియకు సహాయపడుతాయి .అల్పాహారం కోసం ఎండిన ఉసిరి :ఇది విటమిన్ సి యొక్క గొప్ప మూలం మరియు విటమిన్ సి సప్లమెంట్ ల వాలే కాకుండా శరీరం సులభంగా గ్రహించబడుతుంది . తేనె ఉపయోగించి ఎండిన ఉసిరిని తీసుకోవడం వలన శరీరంలో కఫ దోషాలను తగ్గించుకోవచ్చు .పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి