సీనియర్ నటి లక్ష్మీ ఒకప్పుడు తెలుగు తమిళం మలయాళం కన్నడలో సెన్సేషన్. మరి ముఖ్యంగా తెలుగు తమిళ్ కన్నడలో టాప్ హీరోయిన్గా దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీని ఊపేసింది.

ఆమె చలాకితనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్ష్మీ అందంతో పాటు ఆ రోజుల్లో ఆమె హస్కీ బాయ్స్ కి కూడా లక్షలాది మంది అభిమానులు ఉండేవారు. రొమాంటిక్ సీన్లు లక్ష్మీ ఆ రోజుల్లో జీవించేసేవారు, అందం అభినయం ఒకటేమిటి పాత్ర ఎలాంటిదైనా సరే క్యారెక్టర్ ప్రవర్తన చదివి,

అందులో లీనం అయ్యేవారు ఆమె. లక్ష్మీ నట జీవితం అద్భుతం. కానీ ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం సునామి. సినిమాల్లో ఎంత పాపులారో వ్యక్తిగత జీవితంలో కూడా అంతే వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. ఎవరిని ఇష్టపడ్డా సరే రెబెల్ గా డైరెక్ట్ గా తానే ప్రపోజ్ చేసి, నచ్చిన వాడిని పెళ్లి చేసుకునేది. నచ్చకపోతే సింపుల్గా వదిలేసేది. డిసెంబర్ 13 19502లో చెన్నైలో పుట్టింది లక్ష్మి, వీరిది తెలుగు కుటుంబమే తండ్రి ప్రముఖ నిర్మాత రచయిత వరదరావు,

ఈమె ఇంటికి తరచూ నిర్మాతలు దర్శకులు ఆమె తండ్రి కోసం వచ్చి వెళ్తూ ఉండేవారు. అయితే సరిగ్గా పదవ తరగతి చదువుతున్న సమయంలో దర్శకుడు రాజగోపాల్ వచ్చారు. ఇంట్లో ఉన్న అందమైన లక్ష్మి ని చూసి భలే అందంగా ఉన్నావమ్మా, సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. కానీ ఆమె నటించనంది. ఇక ఆమె తల్లిదండ్రులు మాత్రం అంతా లక్ష్మీ ఇష్టమే తాము చెప్పిన ఆమె వినదని నవ్వుతూ చెప్పేవారు. కానీ వరసగా నాలుగు సార్లు వెళ్లిన ప్రతిసారి లక్ష్మిని అడిగారు దర్శకులు రాజగోపాల్, చివరికి లక్ష్మి చిరాకుతో అతనితో అన్నారు నేను నటించను కానీ, నాకు ఎంత డబ్బు ఇస్తారో చెప్పండి

దాన్ని బట్టి నేను నటించాలా వద్దా అనేది చెబుతానన్నారు. ఆ మాట విన్న రాజగోపాల్ షాక్ అయ్యారు. డబ్బుల కోసం నటిస్తావా అవకాశాలు కూడా రావాలి కదా అన్నారట, మీరు ఛాన్స్ ఇస్తున్నారు కదా ఛాన్స్ వచ్చింది డబ్బులు ఎంత ఇస్తారో చెబితే నటిస్తాను అని, మొహమాటం లేకుండా చెప్పేసిందట. దీంతో 2500 ఇస్తానన్నారట ఒక్కసారిగా షాక్ అయింది లక్ష్మి. అంత డబ్బు ఇస్తానంటే నేను నటిస్తాను, కానీ నాకు యాక్టింగ్ రాదని చెప్పారు. లక్ష్మి సరే ఆ విషయాలన్నీ మేము చూసుకుంటామన్నారు దర్శకులు..పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..