ఒక రాజ్యానికి ఒక మహారాజు ఉండేవాడు. ఈయన దేశంలో చాలా ధనవంతుడు. ఈయన అంటే చుట్టుపక్కల దేశస్తులు కూడా బాగా గౌరవం చూపించేవారు. ఇంకా ఈ మహారాజుకి అందమైన కూతురు ఉండేది.

అయితే ఆ రాకుమారికి ఎంత అందం ఉండేదో, అంతకు రెట్టింపు పొగరు ఉండేది. అందులో తాను ఆ దేశానికి యువరాణి కావడంతో, అన్నిట్లో తనను మించిన వాళ్లు ఆ దేశంలో లేరనే చాలా గర్వంతో ఉండేది.

ఈ యువరానికి చాలా పొగరు ఉండడంతో, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉండేది. అయితే ఆ యువరాణి పెళ్లీడుకు రావడంతో, ఆమె తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని అనుకుంటాడు. దీంతో తమ రాజ్యంలో స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. మహారాజు ఇక మహారాజు కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఆదేశానికి, చుట్టుపక్కల ఉన్న దేశాల యువరాజులు అందరూ తరలివచ్చారు.

అయితే మహారాజు కూతురు యువరాణి తన స్వయం వరానికి వచ్చిన ప్రతి యువరాజుని అవమానించింది. దీంతో మరోసారి స్వయంవరం ఏర్పాటు చేసినా కూడా, ఆ సమయంలో కూడా ఆ యువరాణి వచ్చిన వాళ్లలో ఏదో ఒక వంక చెప్పి, ఘోరంగా అవమనించింది. దీంతో ఇలా స్వయంవరం పెడితే ఫలితం లేదని, ఒకసారి తన రాజ్యంలో పెద్ద విందును ఏర్పాటు చేశాడు. మహారాజు ఈ విందుకి చుట్టుపక్కల దేశాల రాజకుమారులని ఆహ్వానించాడు. ఇలా ఆయన తన కూతుర్నికి ఎలా ఎవరైనా నచ్చుతారేమోనని ఏర్పాటు చేశాడు.

మహారాజు అయితే ఈ విందుకి అందరూ రాజకుమారులు వచ్చి తమ స్థానాలలో కూర్చున్నారు. ఆ తర్వాత ఆ విందు దగ్గరికి యువరాణిని చెల్లెక్కత్తెలతో వచ్చి అక్కడికి వచ్చిన రాకుమారులని పొగరుగా చూస్తోంది. ఎంతో గర్వం చూపిస్తూ ఉంటుంది. అయితే యువరాణి లోపలికి వెళ్తూ ఉండగా తనకి ఒక దేశ రాజు కనిపిస్తాడు. అయితే అతడు చూడడానికే చాలా బోద్దుగా ఉండడంతో వెంటనే ఆ రాకుమారి తన పక్కన ఉన్న చెలికత్తెలతో అతడు రాజా లేక పిండి డబ్బా నా అంటూ ఎగతాళి చేసింది. దీంతో ఆ రాజు చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఎత్తుగా ఉన్న మరో యువరాజును చూసి అతడు యువ రాజా లేక తాటి చెట్టు అని ఆ రాజును కూడా అవమానించింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.