తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారని గ్రహించాడు. చిన్నప్పటినుండి ఏమీ అడిగినా కాదనకుండా ఇస్తున్నారని గుర్తించాడు. అందుకే వారు పడ్డ శ్రమకి రిటర్న్ గిఫ్ట్ గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి. అనుకున్నాడు ఇష్టంగా కష్టపడ్డాడు.

తల్లిదండ్రుల కోసం వారు పదిమంది ముందు గర్వంగా చెప్పుకునేలా ఉండడం కోసం తనకి ఎంతో ఇష్టమైన పోలీస్ డిపార్ట్మెంట్లో కొలువు సంపాదించాడు కానీ వీరికి కన్ను కొట్టినట్టుంది. ముందున్న జీవితాన్ని చూడకముందే మృత్యుము ముందుకు వచ్చి అతడిని పొట్టన పెట్టుకుంది.

ఇక ఈ కథ మరెవరిదో కాదు పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో విజేతగా నిలిచిన ప్రవీణ్ ది. ప్రవీణ్ వయసు 22 ఏళ్లు సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీ పాక తండా ప్రేమ్ కుమార్ పద్మ దంపతులకు ఇద్దరు సంతానం కాగా,

ప్రవీణ్ వీరికి మొదటి కుమారుడు ప్రవీణ్ చిన్నప్పటినుంచి చదువులో చురుకు, దీనితో చిన్నప్పటినుండే పోలీస్ డిపార్ట్మెంటులో పనిచేయాలి అనుకున్నాడు అందుకు కష్టపడుతూ వచ్చాడు. తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం కూడా లభించింది దీంతో పట్టు వదలని విక్రమార్కుడిలా మారాడు. బీటెక్ పూర్తి చేసిన ప్రవీణ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాశాడు. అనంతరం సివిల్స్ కోసం కోచింగ్ తీసుకుంటూ ఈ ఏడాదే ఢిల్లీ వెళ్ళాడు.

అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఏ క్రమంలో ఆగస్టు 15 స్వాతంత్ర వేడుకలకు గాను నాలుగు రోజులు సెలవులు ఇచ్చారు దీంతో తన స్వస్థలానికి వచ్చాడు. తల్లిదండ్రులు తమ్ముడితో సరదాగా గడిపాడు. అమ్మ చేసిన వంటలు రుచిగా ఉన్నాయని తిన్నాడు. ఇక ఈసారి పోలీస్ కొలువు వస్తుంది నాన్న అని ముచ్చటించాడు. ఈ క్రమంలో ఆగస్టు 17న స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అక్కడ ఒక ఫ్లెక్సీని కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాకి కి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో చేతికి అంది వచ్చినా కొడుకు, మృతి చెందడంతో కన్నీరు మున్నేరుగా వినిపించారు అతని తల్లిదండ్రులు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.