మురళీ మోహన్ మనవరాలు ఎవరో తెలుసా? వేలకోట్ల ఆస్తి, కీరవాణి కొడుకుతో పెళ్లి వెనుక అసలు నిజాలు తెలి
![](https://chaibisket.in/wp-content/uploads/2024/12/1822.jpg)
మురళీ మోహన్ మనవరాలు ఎవరో తెలుసా? వేలకోట్ల ఆస్తి, కీరవాణి కొడుకుతో పెళ్లి వెనుక అసలు నిజాలు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నటుడు మురళీ మోహన్ బంధువులు కాబోతున్నారు. ఈ రెండు కుటుంబాలు వియ్యమాడనున్నాయి వార్తలు వచ్చాయి. ఈ కథనాలపై మురళీ మోహన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. నా మనవరాలు కీరవాణి ఇంటి కోడలు కాబోతున్న మాట వాస్తవమే అన్నారు. ఆయన మాట్లాడుతూ… నాకు కొడుకు, కూతురు ఉన్నారు. అమ్మాయి విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఆమెకు ఒక కూతురు ఉంది. 2024 ఫిబ్రవరిలో కూతురు బిడ్డ వివాహం ఉంది.
అలాగే కొడుకుకు కూడా ఒక కుమార్తె ఉంది. ఆమెకు కూడా పెళ్లి కుదిరింది. కీరవాణి చిన్న కుమారుడు సింహ కోడూరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. వచ్చే ఏడాది చివర్లో ఈ వివాహం జరుగుతుంది, అని చెప్పారు. మురళి మోహన్ కొడుకు పేరు రామ్ మోహన్ రావు. ఈయన ఏకైక కుమార్తె పేరు రాగ అని సమాచారం. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో రాగ మాస్టర్స్ పూర్తి చేశారట.