మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే ఐదు సూచనలు ఇవే. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది, ఆమెనే దరిద్ర దేవత అనే జేష్ఠదేవతాన్ని ఆ లక్ష్మీ అని అంటారు.

లక్ష్మీదేవి లక్ష్మీ ఇద్దరూ కూడా ఆపోజిట్ గా ఉంటారు. సిరిసంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి, హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు.

జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరు అలక్ష్మి పాల సముద్రాన్ని మదించినప్పుడు, దరిద్ర దేవత పుట్టింది. దరిద్ర దేవత తరవాత ఆలహలం పుట్టింది, ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు.

పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు. అయితే అప్పుడు లక్ష్మీదేవి తన కన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే, వివాహం చేసుకుంటానని అంటుంది. దీంతో అలక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. ఆమెను పెళ్లాడడానికి ఎవరు అంగీకరించరు, చివరికి ఉద్దాలక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు. అలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే ప్రీతి.

అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తారు. అలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మీని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అలక్ష్మి ఉన్నచోట లక్ష్మీ ఉండదు. అక్కాచెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి అలక్ష్మీకి అసలు పడదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకచోట కలిసి ఉండరు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.