ఈ క్షేత్రం కృతయుగం నాటిది. అంటే మనం కలియుగంలో ఉన్నాం కదా, ద్వాపర యుగం త్రేతా యుగం కృతయుగం అంటే, ఫస్ట్ మన యుగమే ప్రారంభమైనటువంటి కృతయుగం నాటి దేవాలయం.

కొన్ని వేల వేలనాటి దేవాలయ చరిత్ర కు దేవాలయానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. హర హర క్షేత్రం శివకేశవులు ఇద్దరూ కూడా కొలువై ఉన్నటువంటి అద్భుతమైన పంచనది సంఘమంగా, వీరాజిల్లుతున్నటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం,

చూసినంతనే భాగ్యం కలగడం మాత్రమే కాదు, ఈ మాసo పుణ్యఫలమంతా కూడా అందరూ అందుకోవాలని ఉద్దేశంతో, జీవితంలో ఒక్కసారి అయినా దర్శించాలి అనే తలంపుతో, అత్యద్భుతమైనటువంటి మహా మహిమాన్వితమైనటువంటి దక్షిణ కాశీగా పిలవబడేటటువంటి, పుష్పగిరి క్షేత్ర విశేషాలతో ఈ వీడియో ఉండబోతోంది. ప్రధానంగా ఇక్కడ హరిహరులు ఇద్దరు కొలువై ఉంటారు.

స్వామి వారు ఇక్కడ వైద్యనాథేశ్వరుడు గా ఇక్కడ కనిపిస్తాడు. ఆ శ్రీమహావిష్ణువు లక్ష్మీ చెన్నకేశవుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ స్వామి వారు వెనకాల ఉన్నది పాతాళ గణపతి, ఆ పక్కనే ఉండేది సుబ్రహ్మణ్యేశ్వరుడు. అసలు చాలా అరుదుగా కనిపించేటటువంటి రూపం, ముందుగా మనకి పరమశివుడు వైద్యనాథేశ్వరుడు గా ఉండడం వెనకాల, సుబ్రహ్మణ్యేశ్వరుడు గణపతి ఉండడం ఆ పక్కనే ఇవన్నీ స్వయంభులు.

ఇంతకీ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే కడప జిల్లాకు 16 కిలోమీటర్ల దూరంలో, చెన్నూరు అని కర్నూల్ నుంచి కడప వైపు వస్తే గనక రైట్ సైడ్ కనిపిస్తుంది. లేదు కడప నుండి కర్నూలు వెళ్లే మార్గమైతే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఒక పదహారు కిలోమీటర్లు కడప నుంచి కర్నూలు వైపుకి జర్నీ చేస్తున్నాము అనగా, మనకు లెఫ్ట్ సైడ్ లోనే చెన్నూరు అనే ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది. ఆ మండలంలోనే పుష్పగిరి ఆ చుట్టుపక్కల ఎవరికైనా తెలియనటువంటి ఈ క్షేత్రం తెలియని వాళ్ళు ఉండరు. ఈ వీడియోని కింద ఉన్న వీడియోలో చూడండి.

ఎందుకంటే ఆ చుట్టుపక్కల చాలామందికి స్వామి వారు ఇంటి దైవంగా పూజలందుకుంటూ ఉంటారు. చెన్నకేశవుడు అని పిలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 15వ తారీఖు నుంచి గుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇది కృతయుగం నాటి దేవాలయం అంటే అర్థం చేసుకోండి. ఎన్ని యుగాలు గడిచిపోయి ప్రస్తుతం కలియుగంలో ఉన్న మనం ఇప్పటికీ ఆలయం చెక్కుచెదరకుండా ఉంది అంటే, ఎంత పురాతనమైనది ఎంత విశిష్టమైనది ఎంత వైశిష్టం కలిగి ఉంటుంది.