వాస్తు ప్రకారం అప్పుల నుంచి బయటపడేందుకు చాలా మంది తమ ఇంట్లో మనీ ప్లాంట్లను పెంచుతుంటారు. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది.

మనీ ప్లాంట్ చూడడానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాటి నిర్వహణ కూడా సులభంగా ఉంటుంది. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఉంటే ఇంటికి మంచి జరుగుతుందని, సంపదలను పొందడంలో సహాయపడుతుందని చాలా మంది చెబుతుంటారు.

ఈ దిశలో నాటొద్దు.. అన్ని సమయాల్లో సరైన దిశలో మనీ ప్లాంట్లను నాటండి. ఈశాన్య దిశలో ఎప్పుడూ వీటిని ఉంచకండి. ఈ దిశలో మనీ ప్లాంట్‌ ఉంటే ఆర్థికంగా నష్టపోతారు. అంతేకాకుండా ఆ ఇల్లు కూడా ప్రతికూలంగా మారుతోంది.

మనీ ప్లాంట్‌లను ఎల్లవేళలా ఆగ్నేయ ముఖంగా ఉంచాలి. గణేశుడు ఈ దిశలో మంచిని సూచించే దేవుడు. కాబట్టి ఈ దిశలో నాటడం వల్ల పుణ్యఫలం లభించే అవకాశం ఉంది.నేలను తాకకూడదు.. మనీ ప్లాంట్ నాటిన తరువాత త్వరగా ఎదుగుతుంది. ఫలితంగా మొక్క తీగలు భారీగా పెరుగుతాయి.

అయితే తీగలు నేలను తాకకుండా చూసుకోవాలి. తీగలు ఎదుగుతున్నప్పుడు తాడుతో కట్టి పందిరిలా అల్లుకునేలా చేయాలి. వాస్తు ప్రకారం.. పెరుగుతున్న తీగలు శుభసూచకం. మనీ ప్లాంట్లు లక్ష్మీ దేవి అభివ్యక్తి అని చెబుతారు. అందుకే వాటిని నేలను తాకకుండా చూసుకోవాలి.

https://youtu.be/cyJAMcf_lV0