వెన్ను, నడుము, పిరుదులు, కాళ్లలో నొప్పి ఉన్నవారికి వెల్లుల్లి పాలు అమృతం లాంటివి. దిగువ వీపు నుంచి నడుము, పిరుదుల వరకు వచ్చే సయాటికా నొప్పి ఉన్నవారికి కూడా ఇది నివారణగా పనిచేస్తుంది.

అయితే పోపుల పెట్టెలో ఉండే వెల్లుల్లికి మన భారతదేశ వంటల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. పచ్చళ్ళు, పోపుల్లో, చెట్నీల్లో ఇలా అనేక ఆహార పదార్ధాల్లో వెల్లుల్లిని వేస్తారు. అలాంటి వారు వెల్లుల్లిలో ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నారని పెద్దలు చెబుతున్నారు.

వెల్లల్లిలో శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోటీన్ , కొవ్వు, కార్బోహైడ్రేట్, చక్కెరలు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి ఉన్నాయి.వెల్లుల్లిని పాలల్లో కలిపి తీసుకుంటే మగవారిలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం అంటున్నారు. వెల్లుల్లి పాల తయారీ విధానం:- ముందుగా వెల్లుల్లిని పై పొట్టు తీసేసి శుభ్ర పరచుకోవాలి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గ్లాస్ పాలను తీసుకుని గిన్నెలో పోసి.. స్టౌ మీద పెట్టి మరించాలి.. అలా పాలు మరుగుతున్న సమయంలో కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను ఒక స్పూన్ వేసుకుని బాగా మరిగించాలి. అనంతరం ఒక గ్లాస్ లోకి ఈ పాలను తీసుకుని తేనే వేసుకుని తాగాలి.. ఈ వెల్లుల్లి పాలను రాత్రి నిద్రపోయేముందు తాగడం మంచి ఫలితాలను ఇస్తుందని అంటున్నారు. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ పాలను తేనే లేకుండా తాగాల్సి ఉంది.

ఆరోగ్య ప్రయోజనాలు:- ఈ పాలు పురుషులలో లైంగిక సామర్ధ్యం పెంచుతాయి. అంతేకాదు వీర్యవృద్ధిని పెంచి వాటి కదలికలు ఎక్కువగా ఉండేలా చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో హార్మోనల్ బేలన్స్ తగ్గింస్తుంది. అంతేకాదు సంతాన సామర్థ్యం తక్కువగా ఉన్నవారికి ఈ పాలు మంచి సహాయకారి. రాత్రి వేళ ఈపాలను తాగితే నిద్రలేమి సమస్యనుంచి బయటపడవచ్చు. మంచి నిద్ర పడుతుంది. పాలు, వెల్లుల్లి కలిపి తీసుకోవడం వలన శరీరంలో మంటను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. వెల్లుల్లి పాలు ఆయుర్వేదంలో సయాటికా, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, నడుము నొప్పి, దీర్ఘకాలిక జ్వరం సహా అనేక రకాల వ్యాధులకు చక్కటి ఔషధం అని పేర్కొనన్నారు. వెల్లుల్లి పాలలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది.