తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్న ప్రగతి ఇమేజ్ డిఫరెంట్.. ప్రగతి ముఖ్యంగా హీరోయిన్స్‌కు తల్లిగా ఎక్కవ సినిమాల్లో కనిపించారు.

బ్రహ్మానందం భార్యగా, హీరో లేదా హీరోయిన్ తల్లిగా, వదిన గా చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కచ్చితంగా ఉండేలా తన కెరీర్ ప్లాన్ చేసుకుంది. ఆమె ఇప్పటివరకు చేసిన ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకుల్లో బాగా గుర్తుండి పోతుంది.

అయితే ప్రగతి ఆంటీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర వీడియో ఒకటి పోస్ట్ చేసింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రగతి చాలా యాక్టీవ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. డాన్స్, ఫిట్నెస్ వీడియోలు షేర్ చేస్తూ కాక పుట్టిస్తుంది. ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిన ఆమె డైలీ జిమ్ లో హెవీ వర్కౌట్లు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనిపిస్తుంది.

48 ఏళ్ళ వయసులో స్ట్రాంగ్ బాడీ ని మైంటైన్ చేస్తుంది. తాజాగా బుల్లెట్ బైక్ నడుపుడుతున్న వీడియో ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.గల్లీ లో బైక్ పై చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సదరు వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. కాగా ప్రగతి సీరియల్స్ లో కూడా నటిస్తుంది.

స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘ ఊర్వశివో రాక్షసీవో ‘ సీరియల్ ఆమె నెగిటివ్ రోల్ చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ప్రగతి సినిమాలు చేస్తుంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. గతంలో ప్రగతి రెండో పెళ్లి పై అనేక రూమర్స్ వచ్చాయి. సదరు పుకార్లను ప్రగతి ఖండించింది. ప్రగతికి ఒక కూతురు ఉంది.