పుట్టినరోజు నాడే చిన్నారి చివరి రోజు అయ్యింది. కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరితో కలిసి సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంది. కేరింతలు కొడుతూ ఎంతో సందడి చేసింది, ఫ్రెండ్స్ అంతా హ్యాపీ బర్త్డే చెప్తూ ఉండగా కేక్ కట్ చేసింది.

సంతోషంగా అందరికీ కేక్ తినిపించింది. కేక్ తిన్న అందరూ అస్వస్థతకు గురయ్యారు, చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. పదవ పుట్టినరోజు తన చివరి పుట్టినరోజు గా ముగిసిపోయింది. ఈ విషాద ఘటన పంజాబ్లో చోటు చేసుకుంది. పుట్టినరోజు నాడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన కేకు తిని మాన్వి అనే పదేళ్ల వయసున్న బాలిక చనిపోయింది.

ఫుడ్ పాయిజన్ కారణంగా బాలిక ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. పాటియాలోని కేక్ తరహా బేకరీలోంచి ఈ కేక్ ని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్లు వెల్లడించారు. మార్చి 24 రాత్రి 7 గంటల సమయంలో కేక్ కటింగ్ జరిగిందని, రాత్రి పది గంటల సమయంలో బాలికతో సహా కుటుంబ సభ్యులంతా ఆస్వాస్థతకు గురయ్యారని, అందరూ వాంతులు చేసుకున్నారని చెప్పారు. మృతురాలు చెల్లెలు కూడా స్పృహ తప్పి పడిపోయిందని, తాతయ్య హెర్బల్ లాల్ వివరించారు.

విపరీతంగా దాహమవుతుంది అంటూ మాన్వి మంచినీళ్లు అడిగిందని నోరు ఆరిపోతుందని చెప్పిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆమె నిద్రపోయిందని అయితే మరుసటి రోజు ఉదయం ఆమె ఆరోగ్యం క్షేనించిందని, గుర్తించి ఆసుపత్రికి తరలించామని తాతయ్య హెర్బల్ లాల్ వివరించారు. బాలిక మాన్వికి ఆక్సిజన్ పైపు పెట్టి శ్వాస అందించారని ఈసీజీ తీశారని అయితే అందులో వైద్యులు ప్రయత్నించినప్పటికీ, చిన్నారి ప్రాణాలను దక్కలేదని హెర్బల్ లాల్ చెప్పారు

కేక్ లో విషపూరిత పదార్థాలు ఉన్నాయని, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు బేకరీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కేక్ లోని శాంపిల్ ని పరీక్షల కోసం పంపించామని, రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు కాగా మరణానికి కొన్ని గంటల ముందు, బర్త్డే కేక్ కటింగ్ లో బాలిక సందడిగా కనిపించింది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా కేక్ కట్ చేసింది అన్దుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.