అధిక బరువుతో బాధపడుతున్న మహిళలు, యువతుల డైట్‌లో ఓట్స్‌ తప్పకుండా ఉండాల్సిందే… కాలక్రమేణా ఈ జాబితాలోకి మ్యూజ్లీ చేరింది.

చిరుతిండిగానూ దీన్ని తింటున్నారు. అయితే బరువు తగ్గాలంటే ఈ రెండింటిలో ఏదీ తింటే ఎక్కువ ఉపయోగకరమో ఇప్పడు తెలుసుకుందాం.

ప్రొటీన్‌, ఫైబర్‌, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలను అందించడంలో ఓట్స్‌, మ్యూజ్లీ రెండూ దేనికవే బెస్ట్‌.కానీ బరువు తగ్గాలనుకునేవాళ్లు మాత్రం ఓట్స్‌ను అల్పాహారంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

తృణధాన్యాల్లో గ్లూటెన్‌ లేనివి ఓట్స్‌ మాత్రమే. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. మ్యూజ్లీలో పాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌, గింజలు అధికంగా ఉంటాయి. అందువల్ల దీనిలో కెలోరీలు ఎక్కువ.