నటుడు శ్రేయస్ తలపాడే గుండెపోటుకి గురయ్యారు. గురువారం ఆయన ముంబైలో ఒక సినిమా షూటింగ్లో ఉన్నారు. షూటింగ్ ముగించుకొని ఇంటికి చేరుకోగానే కుప్ప కోల్పోయారు.

దీంతో అతడి భార్య దీప్తి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకి యాంజీవో ప్లాస్టి చేసిన తర్వాత, అతడి పరిస్థితి నిలకడగా ఉంది. శ్రేయస్ తలపాడే రోజంతా షూటింగ్లో పాల్గొన్నారు.

షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా అతడు సెట్లో అందరితో సరదాగా ఉన్నాడు, షూట్ సమయంలో యాక్షన్ సన్నివేశాన్ని కూడా పాల్గొన్నారు. షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్లి తన భార్యకు అసౌకర్యంగా ఉందని చెప్పాడు.

దీంతో అతడి భార్య ఆయనను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా, అతడు మార్గమధ్యలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి చేరుకోగానే వైద్యులు గుండెపోటు వచ్చినట్టు నిర్ధారించారు. తలపాడే యాంజీవో ప్లాస్టి చేయించుకొని ప్రస్తుతం ప్రమాదం నుండి బయటపడ్డాడు.

శ్రేయ స్థలపడే హిందీ మరాఠీ సినిమాల్లో నటించాడు. 47 ఏళ్ల శ్రేయస్ తలపాడే రెండు దశాబ్దాల కెరియర్ లో 40కిపైగా సినిమాలో చేశాడు. అతడు ప్రస్తుతం వెల్కమ్ త్రీ లో కనిపించనున్నాడు..

https://youtu.be/BDsyy4H7i7o