పూజ చేసేటప్పుడు అసలు చేయకూడని తప్పులు. చాలామంది ఇళ్లలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే, కొన్ని తప్పులు చేస్తారు.

మనం పూజ చేసే సమయంలో, పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కిందపడిన, వాటిని పూజకు ఉపయోగించరాదు. వాసన చూసిన పువ్వులను కూడా పూజకు వాడకూడదు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసిన సత్ఫలితాలు రావు.

ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు, పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి, పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. పూజలు చేసే ముందు నోటితో అశుభ్రమైన విషయాలను మాట్లాడకూడదు. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వ్యక్తితో చేయకూడదు. అది ఆ శుభకర సూచకం, భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి.

పూజలు వచ్చిరాన్ని మంత్రాలు చదవకూడదు, తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు. పూజ చేసే ముందు నోటితో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు. పూర్వికులు మరణించిన వారి చిత్రపటాలు పూజగదిలో పెట్టకూడదని చెబుతున్నారు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు. ఇక పూజలు చేసేటప్పుడు కచ్చితంగా తలస్నానం చేయాలి. గణేషుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు, పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడు ధరించకూడదు.

చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని, దేవతలు నిరాశ చెందుతారట కాబట్టి పూజ సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొక్కటి ఉపయోగించి, ఎప్పుడూ వెలిగించకూడదు.ఇది పేదరిగాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణం అవుతుందని, నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు. దక్షిణముకంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలు కలుగుతాయని, పండితులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.