మనుషులకు కలలు రావడం సహజం. కొన్ని మంచి కలలు, కొన్ని చెడు కలలు ఉంటాయి. అయితే కొన్నికొన్ని సార్లు పాములు కలలో కనిపిస్తుంటాయి.

మీ కలలో ఎప్పుడైనా వచ్చాయా? ఇలా వస్తే ఓ రకమైన భయం పట్టుకుంటుంది. అయితే పాము కాటేసినట్లు లేదా మింగేస్తున్నట్లు కల వస్తే దేనికి సంకేతమంటే.. పాము మిమ్మల్ని కాటేస్తున్నట్లు కల వస్తే.. అది మీ జీవితంలో ఏదైనా ఒకటి వదిలేయాలని సూచిస్తుంది. అది ఇతరులతో బంధం కావచ్చు, ప్రియమైన వ్యక్తి కావచ్చు లేదా ఏదైనా వస్తువు కావచ్చు.

వాటికి మీరు దూరం అవ్వడమో.. లేదా అవే మీకు దూరమవుతాయనో అర్థమంట. పాములు మీరు నిద్రిస్తున్న మంచం మీద కనిపిస్తే దానికి అర్థమేంటంటే.. స్నేక్ డ్రీమ్స్‌ ఫ్రూడియన్ అనాలసిస్ ప్రకారం.. కొన్ని కలల్లో పాములు పురుషులకు ప్రతీక. మహిళలకు పాములు మంచం మీద కదులుతున్నట్లు కలలోకి రావడం..

లైంగిక శక్తిని సూచిస్తాయంట. అంటే వారికి భవిష్యత్తులో ఒక రొమాంటిక్ అనుభవం ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం. లైంగిక కోరికలు, సాన్నిహిత్యం, గోప్యతా భావనను పాములు తెలియజేస్తాయి. అంతేకాదు, మీరు విశ్రాంతి తీసుకోవాలని కూడా ఆ కలలు సూచిస్తాయి.

పాములు కల్లోకి రావడం ఒక హెచ్చరిక కూడా.. పాములు విషాన్ని సూచిస్తాయి. అంటే, పాములు కలలోకి వచ్చాయంటే.. మీకు ఎవరితోనే కీడు ఉందనే అర్థం. పాము కలలోకి వచ్చిందంటే.. మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని అర్థం. అలాగే, మీరు ఒక పని చేయడం వల్ల నష్టం వస్తుందని తెలిసినా.. అతి విశ్వాసంతో ముందుకు వెళ్లడం మంచిది కాదని సూచిస్తుంది. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని పాము కల సూచిస్తుందని పెద్దలు భావించేవారు. ఇది మీకొక ట్రిగ్గర్ వార్నింగ్ లా అన్నమాట.