కలోంజి ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదార్థం.ఇది నెగెళ్ళసాటివా పేరుతో పిలవబడతాయి.కలోంజి విత్తనాలు ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఇది కొంచెం చేదుగా ఉన్నా వంటలకు మచి రుచిని ఇస్తుంది.మసాలాకారం తీపి సువాసన భరిత రుచిని కలిగిస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అమైనో ఆమ్లాలు,ఫైబర్,ప్రొటీన్లు,లినోలినిక్,ఒలెయిక్ ఆమ్లం,అస్థిర నూనెలు,ఐరన్,సోడియం,కాల్షియం వంటివి సమృద్ధిగా ఉన్నాయి.

రోజూ ఒక స్పూన్ తీసుకుంటే గుండె ఆరోగ్యం గా ఉంటుంది.శ్వాస సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది.కీళ్ళమధ్య గుజ్జును తిరిగి పెంచుతుంది.ఈవిత్తనాలే కాకుండా కలోంజి ఆయిల్ కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది.డయాబెటిస్ మంచిది.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి.

పరగడుపున బ్లాక్ టీలో అరస్పూన్ కలోంజీ ఆయిల్ కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.జ్ఞాపకశక్తి పెంచుతుంది.అల్జీమర్స్ , డిమెన్షియా తగ్గిస్తుంది.అరస్పూన్ తేనెలో అరస్పూన్ కలోంజి ఆయిల్ విత్తనాలు వేసిగంటసేపు నానబెట్టి తీసుకోవాలి.అల్జీమర్స్ తగ్గుతుంది. నీటిలో నానబెట్టి తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది. చలికాలంలో ఉబ్బసం బాగా ఇబ్బంది పెడుతుంది.

ఈళచిట్కా పాటిస్తు చల్లని పదార్థాలకు దూరంగా ఉంటే ఉబ్బసం అదుపులో ఉంటుంది.కలోంజి నూనెతో నుదుటిపై నెమ్మదిగా మసాజ్ చేస్తే ఫోన్ వాడడంవలన వచ్చే కళ్ళ అలసట,మంటలు,తలనొప్పి తగ్గిపోతాయి.వేడినీటిలో నిమ్మరసం,తేనె కలిపి తాగేవారు ఒకస్పూన్ కలోంజి పొడి కలిపి తాగడం వలన అధికబరువు సమస్య నుండి బయటపడతారు.యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు వలన శరీరంలో దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తుంది.ఆముదంతో కలోంజి విత్తనాలు నానబెట్టి తర్వాత ఆ నూనెలను నొప్పులు ఉన్నచోట రాసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి.