పూర్వ కాలంలో సహజంగా చుట్టూ లభించే కాయలను ,ఆకులను కూరగా వండుకుని తినేవారు . వాటిలోని ఔషధ గుణాలు వలన వ్యాధులను రాకుండా చేసుకునేవారు .

అందులో అర దొండ అడవులలో లభించే వీటిని సేకరించి కూరగా ,పాచ్చడి ,చారు చేసుకుని తినేవారు . ఇవి అడవుల్లోనే కాకుండా పొలాల కంచెల దగ్గర రోడ్డుల పక్కన కనిపిస్తూ ఉంటాయి . పల్లెటూర్లలో ,పట్టణాల్లో కూడా చూడవచ్చు .

వీటిని ఆరె దొండ ,ఆ దొండ ,ఆరు దొండ ,గోవింద మొక్క ,గోవింద పొద అనే పేర్లతో పిలుస్తారు . ఇది కాపరేసి కుటుంబానికి చెందినమొక్క ఈ మొక్క శాస్త్రీయ నామం కాపారేసి జియానికా అంటారు ఇంగ్లిష్ లో ఇండియన్ క్రీపర్ ,సిలోన్ కీపర్ అని పిలుస్తారు .

ఈ దొండ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలో వ్యాధులు రాకుండా ఆపుతుంది ఈ చెట్టుకు ఉండే పువ్వుల రేకులు సూర్య కిరణాలలాగా ఉంటాయి .అందుకే సూర్య కాంతి పువ్వు అని కూడా పిలుస్తారు ఈ కాయలు చిన్నవిగా గుండ్రగా ఉంటాయి . బయట పచ్చని రంగు కలిగి ఉంటాయి లోపల గింజలతో తెల్లని రంగు కలిగి ఉంటాయి ఈ చెట్టంతా ముళ్ళు ఉంటాయి.

ఈ కాయలో ఉండే ఔషధ గుణాలు కీళ్ళ నొప్పులు ,నడుం నొప్పుల వంటి అన్ని రకాల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడుతాయి . ఈ చెట్టు పై బెరడును తెచ్చి ముద్దగా నూరి తెలు ,పాము కాటువేసిన చోట పూస్తారు . ఇలా చేయడం వలన విష ప్రభావం తగ్గుతుంది . గజ్జి ,తమర వంటి చర్మ సమస్యలు తగ్గాలంటే స్నానం చేసే నీటిలో ఈ ఆకులను వేసి స్నానం చేస్తారు . ఈ ఆకుల కాషాయం తాగడం వలన శరీరంలో నులిపురుగులను తగ్గిస్తుంది .