ఒక నర హంతకుడిని నాగర్ కర్నూల్ పోలీసులు పట్టుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, పోలీస్ పోలీసులకు తెలిసే 12 మంది అమాయకులను చంపాడు. ఈ నరహంతకుడైన సత్యనారాయణ అలియా సత్యం యాదవ్.

ఇతనిది నాగర్ కర్నూల్ సత్యం యాదవ్ చేసే పని, రియల్ ఎస్టేట్ తో పాటు క్షుద్ర పూజలు గుప్తనిధుల వెలికితీత చేస్తానని, అమాయకులకు చెవులు పూలు పెడుతూ ఉంటాడు. ఇతని వేట మొత్తం అమాయకులే.

అందుకోసం జ్యోతిష్యం అనే ముసుగు వేసుకున్నాడు, ఎలాంటి కష్టాలు ఉన్నా సరే తీరుస్తానని క్షుద్ర పూజలు చేసే, కష్టాలనుండి మిమ్మల్ని బయటపడేస్తానని చెప్పి, పొరపాటున ఇతని దగ్గరికి జ్యోతిష్యం పేరుతో, ఎవరైనా వచ్చారా అంతే పూర్తిగా మాటలతో వశపరచుకుంటాడు. బలంగా నమ్మిస్తాడు.

గతంలో తాను గుప్త నిధులు తీసి ఇచ్చిన వారు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు, నాకు గుర్తుల గుప్త నిధుల లొకేషన్ తెలుసు నేను తీసి పెడతాను, మీ ఇళ్లలో ఉన్న ఏ ఇళ్లలో ఉన్నా కూడా బయటకు తీస్తాను, ఒకే దెబ్బకు మీరు కోటీశ్వరులు అవుతారని చెబుతూ ఉంటాడు. అయితే గుప్త నిధుల వెలికితీతకు భారీగా డబ్బు డిమాండ్ చేస్తారు. ఎవరైనా కస్టమర్ తమ ఇంటికె తీసుకువెళ్లే తమ ప్రాంతంలో కానీ, తమ పొలాల్లో కానీ ఇంటి ఆవరణలో కానీ గుప్త నిధులు ఉంటే చెప్పాలని తీసుకువెళ్లారా ఇక అంతే సంగతులు.

ఆదివారం రాత్రి సమయం చూసుకుంటాడు, క్షుద్ర పూజలు చేస్తాడు కోడి రక్తం చిందిస్తాడు నిమ్మకాయలు విసర్తాడు, పసుపు కుంకుమ వేసి ఏవేవో పిచ్చి మంత్రాలు చదివి బలంగా నమ్మిస్తాడు. తనని దేవత ఆవహించిందని పలానా తూర్పు భాగంలో, భారీగా గుప్త నిధులు ఉన్నాయని, అమ్మవారు చెప్పారని చెబుతూ ఉంటాడు. అదిగో అక్కడ గుప్త నిధులు ఉన్నాయంటే ఎవరికైనా ఆశ కలుగుతుంది. ఎందుకంటే ఇలాంటి వాటిపై అత్యాశ పెంచుకున్న వారికి, ఇవేమీ కనిపించవు ఆ వీక్నెస్ ని పట్టుకొని భారీగా డబ్బులు వసూలు చేస్తాడు. ఒకవేళ అంత డబ్బు లేదంటే మాత్రం ఆస్తులు తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..