అక్టోబర్ 15 ఆదివారం దసరా నవరాత్రులు ప్రారంభం అవ్వబోతున్నాయి. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్రయిజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్రయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, మరియు పదవరోజు విజయదశమి తో కలిపి దసరా అంటారు.

ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రులు శరన్నవరాత్రులు అని అంటారు. శరద్రుదువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రులు అనే పేరు వచ్చింది. ఆశ్వయుజ మాసంలో పండుగను జరుపుకుంటూ ఉంటారు.

చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. ముందు 9 రోజులు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తర్వాత పదవరోజు విజయదశమిని జరుపుకుంటూ ఉంటారు.

ఈ విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచాడు. అంతేకాక పాండవులు వనమాసానికి వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా ఇదే. ఈ సందర్భంగా రావణ వాద జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. అయితే ఇలాంటి రోజున మహిళలు ఏ రంగు గాజులు వేసుకోవాలి తెలుసుకుందాం. గాజులు కేవలం అందం కోసo మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు..

మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం. మట్టి గాజులు ధరిస్తే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి దేవి నివాసం ఉంటుంది. బంగారు గాజులు ఉన్నవారు బంగారు గాజులు కూడా ధరించవచ్చు. కానీ ఆ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. నవరాత్రులలో రెడ్ కలర్, గ్రీన్ కలర్ గాజులు, పింక్ కలర్ గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.