పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాలి కానీ, ఒక పెళ్లి కొడుకు మాత్రం అలా చేయలేదు. పెళ్లికి టిప్ టాప్ గా రెడీ అయ్యి తీరా తాళి కట్టే టైం కి వెళ్లి బాత్రూం లో దాక్కున్నాడు.

నాకు ఈ పెళ్లి వద్దు చేసుకోనంటే చేసుకోను అంటూ మొండికేశాడు పెద్దలంతా నచ్చ చెప్పారు సరే చేసుకుంటాను అన్నాడు. కానీ చివరికి పెళ్లికూతురు ఇచ్చిన షాక్ తో దిమ్మతిరిగింది పెళ్లి కొడుక్కి అసలేం జరిగింది. విశాఖలోని గోపాలపట్నం ఏరియా అబ్బాయి ఇంటి ముందు పెద్దపెల్లి మండపం

వచ్చిన వాళ్లకి పెట్టేందుకు ఒకవైపు భోజనం ఏర్పాట్లు భాజా భజన్తీయులతో సందడిగా ఉంది. మరికొద్ది సేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది అందరూ రెడీ అయ్యారు పూజారి వచ్చాడు, మంత్రాలు చదువుతున్నాడు. మధ్యలో పెళ్ళికొడుకుని తీసుకొని రండమ్మా అన్నాడు. ఇంకేముంది అబ్బాయి కోసం చూస్తే అబ్బాయి కనిపించలేదు.

ఏమైపోయాడని అందరూ వెతుకుతూ ఉంటే బాత్రూంలో ఉన్నాడు పెళ్లి కొడుకు లోపలికి వెళ్లి తలుపు పెట్టుకుని నాకీ పెళ్లి వద్దు, నేను ఈ పెళ్లి చేసుకోను అని మారం చేశాడు. కారణం అమ్మాయి వారం రోజుల నుంచి తనతో ఫోన్లో సరిగ్గా మాట్లాడటం లేదట.విశాఖలోని పాత గోపాలపట్నం కు చెందిన నాగరాజుకు,

విశాఖ కొబ్బరి తోటకు చెందిన పద్మకు అక్టోబర్ 25న పెళ్లి జరగాల్సింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు జరగాల్సిన వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది, పెళ్లి కొడుకు పెళ్లికి ససేమిరా అన్నాడు. అమ్మాయి తనతో సరిగ్గా మాట్లాడలేదని, తాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు దీంతో పంచాయతీ స్టేషన్ వరకు వెళ్లింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.