చల్లటి గాలులలో చక్కగా నిద్రపోయేందుకు, ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషనర్ వైరింగ్ లో లోపం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నాసిరకం వైరింగ్ వల్ల షాక్ సర్క్యూట్ అయ్యింది. ఆ పొగలే తల్లి బిడ్డల పాలిట మృత్యు భాషలు అయ్యాయి.

ఖర్చు తక్కువ అని నాసిరకం వస్తువులు ఉపయోగిస్తే చాలు, అవే ప్రాణాలకే ముప్పు తెచ్చేస్తున్నాయి. చెన్నై శివార్లలోని అంబత్తూరు ఏకాంబరం నగరంలోని ఒక ఇంట్లో అదిలా అనే ఒక 50 ఏళ్ల టీచర్, తన పదహారేళ్ల కూతురు నస్రింతో కలిసి అద్దెకు ఉంటున్నారు.

స్క్రీన్ ప్లస్ టు చదువుతోంది, అదిలా భర్త రెహమాన్ కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయారు. అదిలా స్థానికంగా ఉండే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తూ జీవితం గడుపుతోంది. ఎండసెగ బాగా ఉండడంతో పగటిపూట కూడా ఏసి ఆన్ చేసి ఉంచారు.

రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో వీరు నివసిస్తున్న ఇంట్లో నుంచి పొగలు పెద్దగా రావడానికి ఇరుగుపొరుగువారు గమనించారు. ఏం జరిగిందని తెలుసుకునేందుకు ఇంటి దగ్గరకు వెళ్లి తలుపులు కొడితే, సమాధానం లేదు దీంతో సందేహం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. మరోవైపు ఇంటి తలుపులు బద్దలు కొట్టారు.

తలుపులు పడిపోయిన వెంటనే ఇంట్లో పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. కాస్తంత అది తగ్గిన తర్వాత చూస్తే అక్కడ పడి ఉన్న తల్లి కూతుర్లు ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయినట్లు ఉండడాన్ని గమనించారు. వెంటనే వారికి కిల్పాకంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. అయితే వారిని పరీక్షించిన డాక్టర్లు కొన్ని గంటల క్రితమే వారు చనిపోయినట్టు నిద్దరించారు.

పొగను పీల్చడం వల్లే వీరికి ఊపిరాడక చనిపోయినట్టు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కంటిన్యూగా ఉపయోగం లో ఉండే కరెంటు ఉపకరణాల వైరింగ్ విషయంలో నాసిరకం వైర్ల వాడకం పరమ డేంజర్ అంటూ, స్థానికంగా ఉండే విద్యుత్ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. వైర్లు ఓవర్గా హీటెక్కి షాక్ సర్క్యూట్ అయ్యాయని వాటి వల్ల వచ్చిన పొగతో, అదిలా నశ్రిన్ ప్రాణాలు పోయి ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.