ఈనెల 23 అనగా డిసెంబర్ 23 2023న అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి.

ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తినవచ్చా. అసలు ఉపవాసం ఎలా చేయాలి? ఏకాదశి ద్వాదశి పారాయణ సమయంలో తో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం.

ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి మహిమాన్వితమైన రోజు, ఎంతో పవిత్రమైన రోజు ఏడాదిలో వచ్చే 24 ఏకాదశిలకు, ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే, అన్ని ఏకాదశిలకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉంటే,

వైకుంఠ ప్రాప్తి కలుగు తుందని జన్మజన్మల పాపాలు నశిస్తాయని, తన నుండి ఉద్భవించిన శక్తి ఏకాదశి, అమ్మవారికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వరం ఇచ్చాడు. ఈరోజు శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడు. ఈ భూమి మీద మూడు కోట్ల దేవతలు ఉండే, ఈరోజు ఉపవాసం ఉంటే మహా పుణ్యం.

కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. చాలామందికి ఈ రోజు ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది. అందుకే ఈ వీడియోలో ఉపవాసం ఎలా చేయాలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉంటే మనసు పరిశుద్ధమవుతుంది. శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది పరిశోధనలు కూడా నిరూపించాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.