బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినటువంటి సీనియర్ నటుడు విశ్వేశ్వరరావు. నిన్న చెన్నైలో మరణించారు.

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యుడిగా ఆయనకు సంతాపాన్ని ప్రకటించింది. కాకినాడకు చెందిన విశ్వేశ్వర రావు తన చిన్నతనంలో తండ్రి హరికథలు చెప్పడంతో, ఆయనకు ఇంట్రెస్ట్ ఏర్పడింది. పొట్టిగా ఉండడంతో పాటుగా మాటలు బాగా మాట్లాడడంతో పాటు,

హాస్యం వచ్చేలా యాక్షన్ కూడా చేయడంతో అప్పట్లో ఎస్.వి.రంగారావు ఏఎన్నార్ల షూటింగ్లో ఆయనతో సరదాగా గడిపేవారు. పద్మనాభం సినిమాలో పొట్టి లీడర్లో బాగా బాలనటుడిగా చిన్న వేషం వేశారు. అలా కొన్ని సినిమాలు చేయడంతో ఆయన చదువు అటకెక్కింది.

అలా బాలభారతం వంటి సినిమాలలో శ్రీదేవి పక్క నటించారా ఆయన. అలా పెద్దయ్యాక షూటింగ్ గ్యాప్ లో చదువుకుంటూ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఇక తర్వాత షూటింగ్లో లేకపోవడంతో ఫార్మసీ కంపెనీలో రిప్రెంటిటివ్గా చేరి విజయవాడ బెంగళూరు చెన్నై తిరుగుతూ ఉండేవారైనా,

అలా చెన్నై వెళ్లే మళ్లీ సినిమా వేషాలు వేస్తూ తన కంటూ శైలిని రూపొందించుకున్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యం బారిన పడడంతో నిన్న మరణించినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.