జీలకర్రను మనం రోజువారీగా వంటల్లో వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది.నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అంటారు.రెంటికీ ఔషధ గుణాలున్నాయి.

వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు . ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు (మసాలా) దినుసులలో ఒకటి . ఇది సుమారు 30-50 సెంటిమీటర్లు పెరిగే మొక్క. దీని గింజలు గోధుమ రంగులో ఉన్న చిన్న గింజలు . గింజలనే వంటకాల లోనూ, ఔషధము గాను వాడుతారు .

ప్రాచీన కాలము నుండి ఇది వాడుకలో ఉంది .మొదటిలో ఇది ఇరాన్‌ ప్రాంతములో విరివిగా ఉండేదని బైబిల్ లో ఉందని చెప్పుకుంటారు . గ్రీకులు, రోమన్లు వాడుకులో ఉందిని అంటారు .హిందూ వివాహములో జీలకర్ర బెల్లము తలపై పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ఘట్టము .పైత్యరోగాలకు .

జీలకర్రను నిమ్మరసముతో కలిపి సూర్యోదయ సమయాన, సూర్యాస్తమ సమయమున రెండపూటలా తింటే … తలతిప్పు, కడుపులోని వేడిని మొదలగు పైత్యరోగములు తగ్గును. మూత్ర సంబంధ వ్యాధులకు . జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి.

నీరసము తగ్గుటకు : ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని, ధనియాలు+ జీలకర్ర మిశ్రమం గాని తీసుకొంటే మంచిది. పేగులు శుభ్రపరచుట : ధనియాలు, జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి, అన్నంలో, టిఫిన్లు, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకుదూరంగా ఉంటారు.