లక్ష్మీ కళ ఉట్టిపడే ఒక ఆడబిడ్డ చదువుల సరస్వతిగా పేరు తెచ్చుకున్న బంగారం లాంటి ఆడబిడ్డ. కొండంత భవిష్యత్తును కొంగున కట్టుకుని కథలు చిట్టి తల్లి మీద విధివిషం చిమ్మింది.

కరెంట్ షాక్ రూపంలో ఆమెకు దేవుడు ఇచ్చిన రెండు చేతుల్ని నిర్ధాక్షణంగా లాగేసుకుంది. కొండంత కష్టంలో కూరుకుపోయిన ఆ విధి వంచిత ఆత్మస్థైర్యాన్ని ఆయుధంగా మలుచుకుంది. చేతులు లేకపోతే ఏం గుండెల నిండా ఆత్మవిశ్వాసం ఉంది.

ఆ కాన్ఫిడెన్స్ తోనే అనుకున్నది సాధిస్తా అంటూ, ముందుకు కదిలింది. వంచించిన విధి కొమ్ముల్ని వంచగలిగింది. దురదృష్టాన్ని తన ఉక్కు పాదాలతో నొక్కి పట్టగలిగింది. ఆమె ఊర్మిళ ది నెగిటివ్ ఆఫ్ సత్యసాయి జిల్లా రండి ఆ విజేతని పలకరిద్దాం. నా పేరు ఊర్మిళ మాది సత్యసాయి జిల్లా సిద్దయ్యగుట్ట గ్రామం.

వెంకట్రాముడు లక్ష్మీదేవి అనే అమ్మానాన్నలకు నేను మూడవ కూతురిని, నాన్న ఒక్కడే రెక్కల కష్టంతో అంతంతమాత్రంగా ఇల్లు గడుస్తున్న ఉన్నంతలో తృప్తిగా జీవిస్తున్న కుటుంబం మాది. పేదరికం మమ్మల్ని కాస్తంత ఇబ్బంది పెట్టింది కానీ మా సంకల్పాన్ని మా ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం అది కట్టడి చేయలేక పోయింది. పరీక్షలో నాకు వస్తున్న మార్కులు చూసి నాన్న అనేవారు బిడ్డ నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావమ్మా అని,

నాకు అదే నమ్మకం. అయితే విదికి నన్ను చూసి నా కుటుంబాన్ని చూసి కన్ను కొట్టిందేమో, అంతులేని విషాదానికి బాటలు వేసింది. నేను ఆరవ తరగతి చదివేటప్పుడు ఇంటి మీదకు ఇనుప రాడ్డు తీసుకు వెళ్తూ ఉండగా అది కరెంటు వైర్లకు తగిలింది. కరెంటు షాక్కు నా ప్రాణాలని తీయలేకపోయింది కానీ, నా రెండు చేతుల్ని మాత్రం పనికిరాకుండా చేసేసింది. పూర్తి సమాచారం కోసం కింది ఉన్న వీడియోలో చూడండి.