మన శరీరం రెండు సమయాల్లో చాలా తొందరగా బరువు తగ్గుతుంది . ఒకటి పడుకునేటప్పుడు తగ్గుతుంది. రెండు వర్కౌట్ చేసేటప్పుడు బరువు తగ్గుతుంది. నిద్ర పోయేటప్పుడు బరువు తగ్గాలంటే ఎక్కువ ఆహారం తీసుకోకూడదు పడుకునేముందు. నిద్రపోయే ముందు కొన్ని ఆయుర్వేద చిట్కాలు వాడాలి. పడుకోవడానికి రెండు,మూడు గంటల ముందు భోజనం చేయాలి. అలాంటి వారి శరీరం మీద బరువు తగ్గడానికి వాడే ఏ చిట్కాలు అయినా బాగా పనిచేస్తాయి. ఇలా చేయడం వల్ల చాలా తొందరగా బరువు తగ్గవచ్చు. ఈ చిట్కా కోసం మనం ఒక పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి.

దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం మరియు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. దీని కోసం కావలసిన పదార్థాలు సోంపు, పసుపు, అవిసె గింజలు, జీలకర్ర, కరివేపాకు, కరక్కాయ, సైంధవ లవణం, ఇంగువ ఇవన్నీ బయట ఆయుర్వేద షాపుల్లో సులభంగా లభిస్తాయి. ఏవైనా పదార్థాలు దొరకని ఎడల మిగిలిన ళవాటితో ఈ చిట్కా పాటించండి. ఇందులో వాడే సోంపు, జీలకర్ర , కరక్కాయ తప్పకుండా వాడాలి. కరక్కాయ పౌడర్ ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంటుంది. సోంపు, జీలకర్ర, ప్రతి కిరాణా షాప్ లో దొరుకుతుంది.మీ దగ్గర త్రిఫలచూర్ణం అందుబాటులో ఉంటే కరక్కాయ బదులు అది కూడా వాడుకోవచ్చు.