అతివేగం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఇంట్లో చెప్పకుండా అర్థరాత్రి సమయంలో బయటకు వెళ్లిన కొంతమంది విద్యార్థులు, మద్యం తాగి జల్సా చేస్తూ కారును స్పీడ్ గా డ్రైవ్ చేసి అనుకొని ప్రమాదానికి గురయ్యారు. కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చారు.

ఈ విషాద ఘటన స్థానికంగా తీగ కలకలం రేపుతోంది. షామీర్పేట్ లోని విశ్వ విశ్వనీ కళాశాలలో m బి ఏ చదువుతున్న కొంతమంది విద్యార్థులు, శుక్రవారం రాత్రి 11:40 నిమిషాలకు లాంగ్ డ్రైవ్ కోసమని వెళ్లారు. కొంపల్లిలో మద్యం బాటిల్ తీసుకొని, కారులో డ్రింక్ చేస్తూ కీసర మండలం

బోగారంలోని హోలీ మేరీ కళాశాల వరకు వెళ్లారు. అక్కడి నుంచి తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న విద్యార్థులు, కారు స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి ప్రమాదవశాత్తు ఒక చెట్టుని ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో విశాల్, భవిష్ రావు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికే చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీపంలోనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అయితే కారు నడుపుతున్న ఫిలిప్ జాన్ మద్యం తాగనప్పటికీ, మిగిలిన వారు మద్యం తాగి సెల్ఫీలు దిగుతూ జల్సా చేస్తూ ఉండగా, కారు అదుపు తప్పి ఉండవచ్చని, పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన పైరేట్స్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.