మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి, అయితే వాటిని మనం అంతగా గమనించం, తీరా తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతూ ఉంటాము. అదేంటి అనుకుంటున్నారా,

మన చేతి వేళ్ళు గోర్ల పై, కింది వైపు ఉండే భాగంలో, అర్ధ చంద్రాకారంలో వెన్నెల వంకను పోలిన ఆకారం ఉంటుంది, దాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? గమనించే ఉంటారు లెండి, కానీ దాని గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. సైంటిఫిక్ భాషలో దీనిని లులూనా అని పిలుస్తారు.

ఈ లులూనా మన శరీరంలోని అత్యంత సున్నితమైన భాగంలో ఒకటిగా చెప్పుకోవచ్చు లులూనా అంటే ఏంటి అని మీకు డౌట్ రావొచ్చు.. లూనా అంటే లాటిన్ భాషలో స్మాల్ మూనే అని అర్థం అంటే చంద్రవంక అని అర్థం. లులూనా మీరు ఎక్కువ బొటన వేలి గోరు లో చూస్తూ ఉంటారు.అయితే ఈ లులూనా కనుక దెబ్బతింటే గోర్లు పెరగడం ఆగిపోతుందని మీకు తెలుసా?

అంతేకాదు మన గోర్లు రంగు లులూనా పెరిగే తీరును బట్టి మన శరీరంలోని అనారోగ్య సమస్యలు కూడా తెలుసుకోవచ్చు, అని మీకు తెలుసా. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. బొటనవేలు గోరు పై లులూనా అసలు లేకపోతే మీరు రక్తహీనత లేదా పౌష్టికాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఒక వేళా మీ లులూనా రంగు నీలం లేదా పూర్తి తెలుపు లో పాలి పోయి ఉంటే మీకు డయాబెటిస్ రాబోతుంది అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ లులూనా మీద ఎరుపు రంగు మచ్చలు ఉంటే మీకు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి అని అర్థం. లులూనా ఆకారం మరీ చిన్నగా గుర్తు పట్టలేనంతగా ఉంటే మీరు అజీర్ణంతో బాధపడే ఉన్నారని అర్థం. ముఖ్యంగా మీ శరీరంలో విష, వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్ ఏక్కువగా పేరుకు పోయాయి అని అర్థం చేసుకోవాలి. అలాగే మన చేతి గోర్లు గురించి మీకు తెలియని మరికొన్ని విషయాలు మన చేతి వేళ్లలో, మధ్యవేలు, మధ్య వేలు గోరు మిగతా గోరు కన్నా చాలా వేగంగా పెరుగుతుంది. ఇక కాలి వేళ్ళ గోర్లు, మీ చేతి వేళ్ళ గోర్లు చాలా త్వరగా పెరుగుతాయి అని మీకు తెలుసా..