రేపే ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, 33 కోట్ల మంది దేవతలు వైకుంఠనికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు.

అందుకే ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్లి, విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి. అప్పుడు ఉత్తర దిక్కు కుబేర స్థానం కుబేరుని అనుగ్రహము, లక్ష్మీ కటాక్షము కలిగి సంవత్సరం మొత్తం ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు.

కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి కుదరని వారు ఏమి చేయాలి అనేది తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి సూర్యోదయానికి ముందే విష్ణు ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. మరి సూర్యోదయానికి ముందే విష్ణు ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం వీలుకాకపోతే ఏం చేయాలి.

గుడికి వెళ్లడానికి కుదరని వారు ఇలా చేయండి మీ ఇంట్లోనే విష్ణుమూర్తిని ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీనారాయణ ఫోటో కానీ, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఫోటో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసి, సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టాలి. ప్రమిదల ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపం పెట్టాలి.

తులసీదళాలు ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి. రెండు అతి శక్తివంతమైన మంత్రాలు 21సార్లు చదవాలి. మొదటి మంత్రం “ఓం నమో నారాయణాయ” అష్టాక్షరి మంత్రము రెండవ మంత్రము “ఓం నమో భగవతే వాసుదేవాయ” ద్వారశక్క్షరి మంత్రం రెండు మంత్రాలు చదివాక పచ్చ కర్పూరం దోహారతి ఇవ్వండి. తర్వాత ఆవుపాలతో చేసినటువంటి చక్కెర పొంగలి లేదా బెల్లం పరమాన్నం నైవేద్యం పెట్టండి. దాన్ని కుటుంబంలో సభ్యులందరూ స్వీకరించండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.