ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు సర్వసాధారణం అయ్యాయి. ప్రతి చిన్న విషయానికి చావే శరణ్యమని తమ బంగారు భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు.

భవిష్యత్తుపై సరైన అవగాహన లేక తల్లిదండ్రులు తిడతారని పరీక్షలు ఫీలయ్యామని ఉపాధ్యాయుడు మందలించాడని డిప్రెషన్ కి గురై కొంతమంది విద్యార్థులు. అర్ధాంతరంగా తను చాలిస్తున్నారు ఇప్పుడు చెప్పబోయే వార్త కూడా తల్లి మందలించిందని,

ఒక యువకుడు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన, స్థానికంగా తీవ్ర కలకలం రేపింది తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామానికి చెందిన వెంకటేష్ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగేస్తున్నాడు.

అయితే వచ్చిన డబ్బులు అన్ని ఇంట్లో ఇవ్వకుండా జల్సాలు చేస్తూ స్నేహితులతో కలిసి బలాదురుగా తిరుగుతూ ఉండేవాడు. అయితే విసిగిపోయిన తల్లి ప్రవర్తన మార్చుకోవామని మందలించింది. వచ్చిన డబ్బులు అన్ని ఖర్చు చేస్తున్నాడని వెంకటేష్ పై తల్లి కోప్పడింది దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు ఇంటి నుండి వెళ్లిపోయాడు.

కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కొడుకు ఎక్కడికి వెళ్లి పోయాడో తెలియక ,కుటుంబ సభ్యులు తెలిసిన వారిని స్నేహితులని ఆరా తీశారు కానీ లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మూడు రోజుల తర్వాత కాలువలో గుర్తుతెలియని స్థితిలో నీటిపై మృతదేహం తేలింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానంతో తల్లికి సమాచారం అందించగా, అక్కడికి వచ్చిన తల్లి మృతదేహం పై ఉన్న బట్టలను గుర్తించి బోరున విలపించింది. చేతికి అందించిన కొడుకు దూరం కావడంతో ఆ తల్లి కన్నీరు మున్నేరుగా విలపించింది అయ్యో కొడుకా ఎంత పని చేసావు. కోపంలో చిన్న మాటంటే ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటావా అంటూ, ఆ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.