అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా దూసుకు వచ్చేన కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది.

అదే గమనించిన చుట్టుపక్కల వారు గబగబా వచ్చి కారు డ్రైవర్ని రక్షించారు. ఇదంతా ఒక ఇంటి ముందున్న సీసీ కెమెరాలు రికార్డు అయింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కథనం ప్రకారం సిటీలో ఓ యువకుడు తన బెంజ్ కార్లో దూసుకు వెళ్తున్నాడు.

వేగంగా గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు ఒక టర్నింగ్ వద్ద అదుపు తప్పింది. అదే వేగంతో ఒక ఇంటి ముందు ప్రవహిస్తున్న కాలువలో పడింది. కారు సగానికి పైగా నీటిలో మునిగిపోయింది. కారు నుంచే బయటపడేందుకు డ్రైవర్ ప్రయత్నం చేశాడు.

ఇంతలో అక్కడికి చేరుకున్న స్థానికులు కాలువలోకి దూకి ఆ డ్రైవర్ను కారులో నుండి బయటకి లగాడు. ఆపై ఇద్దరూ కలిసి వడ్డుకు చేరారు.కారు మొత్తం నీటి మునిగింది ఇదంతా ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టిన సదరు ఇంటి ఓనర్, ఈ ప్రమాదం తనని చాలా భయపెట్టిందని కామెంట్ చేశాడు.