వేడి చేయడం తగ్గాలంటే ఏమి చిట్కా ఆచరిస్తే తగ్గిపోతుంది చూద్దాం.. చాలామంది నాకు వేడి చేసింది, అది పడలేదు, ఇది పడలేదు అంటూ ఉంటారు. చాలా మంది పుల్కా వేడి అని అంటారు. కొంతమంది తేనె వేడి అని అంటుంటారు. మామిడి పండు, బొప్పాయి పండు, గోంగూర వేడి, అని అంటూ ఉంటారు, ఆ పదార్థాలను మీరు మానేస్తారు తప్ప వేడి తగ్గడానికి ప్రయత్నం ఎవరూ చేయలేదు, అసలు వేడికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మన శరీరంలో నిరంతరం కణజాలంలో శక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ ఉత్పత్తి అయిన వేడి 98.4 మించి పెరగకూడదు, అలానే తగ్గకూడదు. అలా సరిపడా మన శరీరం ఎప్పుడూ చూసుకోవాలి. మన శరీరంలో కణజాలంలోని నీళ్లు ఈ వేడి పెరగకుండా వేడి లక్షణాలు రాకుండా రక్షించడానికి నీళ్లు ఉపయోగపడుతూ ఉంటాయి. మనo నీళ్లు సరిపడా తాగకపోతే కణాల్లో నీళ్లు సరిగ్గా అందవు నీళ్లు చాలనందున కూలింగ్ మెకానిజం కూడా పనిచేయదు.

మీకు ఎవరికైనా వేడి చేసింది అనే లక్షణాలు ఎలా తెలుస్తుంది అంటే కళ్ళు మంటలు, మూత్రం మంట, మాడు నొప్పి, ఎండలోకి వెళితే మూత్రం పోసేటప్పుడు వేడిగా రావడం, నోటిలో పొక్కులు రావడం వీటన్నింటినీ వేడిచేయడం అంటారు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే మన శరీరంలో నీళ్లు చాలక వచ్చాయి. మన శరీరంలో నీరు తగ్గిపొందని మన శరీరం లక్షణాలు అలా బయటకు చూపిస్తుంది. ఇలాంటి లక్షణాలు వస్తే మీ శరీరంలో నీళ్లు సరిపడా లేవని అర్థం. మీరు నీరు తాగితే సరిపోతుంది, అంతేకానీ మీరు తినే వస్తువుల వల్ల కాదు. చాలామంది మామిడి పండు, బొప్పాయి వేడి అంటూ ఉంటారు కానీ మామిడి, బొప్పాయి వేడి చేయవు. నువ్వులు తేనె కూడా వేడి చేయవు. మన శరీరంలో అసలు తప్పు నీరు ఛాలకపోవడం వల్ల వేడి చేస్తుంది.

నీకు వేడి తగ్గించేది నీళ్లు అని తెలుసుకోండి. ఎవరికైనా కళ్ళు మండిన, మూత్రం మండిన, నోరు ఎండి పోతూ ఉన్న నోట్లో పొక్కులు వచ్చిన, ఇవన్నీ మన శరీరానికి నీళ్లు చాలక వచ్చిన లక్షణాలు మాత్రమే దీనికి నీళ్లు తాగడం మందు తప్ప వేరేది ఏమి ఉండదు. నీరు తాగితే డైరెక్టుగా బ్లడ్ లోకి వెళ్లి పోతాయి కాబట్టి మంచి నీరు తాగడం అనే టెక్నిక్ తెలుసుకోండి. వేడి చేయడం పూర్తిగా పోతుంది మన శరీరంలో మూడు వంతుల నీటితో నిండి ఉంది ఒక వంతు మాత్రమే పదార్థంతో తయారై ఉంటుంది కాబట్టి మన శరీరానికి మూడు వంతుల నీటి అవసరం ఉంది.
మరింత సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.