నిద్ర వల్ల శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది. అంతేకాక వారు రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు.

సరైన నిద్రతో మరుసటి రోజు నూతనోత్తేజంతో పనిచేసేందుకు కావాల్సిన శక్తినిస్తుంది. జీర్ణక్రియ నుండి మీ మానసిక స్థితి వరకు అన్నింటిపై నిద్ర ప్రభావాల్ని చూపిస్తుంది. అందువల్ల మీ మెదడు సరిగ్గా పనిచేయడానికి తగినంత నిద్ర తప్పనిసరి.

అయితే నిద్ర పోయి లేచేటపుడు జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. ముఖ్యంగా నిద్ర లేవడం అంటే, చటుక్కున లేచి, ఒళ్లు విరుచుకుని మంచం దిగడం మంచిది కాదు. అప్పటి వరకూ విశ్రాంత స్థితిలో ఉన్న శరీరం అంత ఉత్తేజం పొందేలా నిద్ర లేవడానికి నిర్దిష్ట పద్ధతిని అనుసరించాలి.

నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు.అయితే నిద్రలో ఒక్కొక్కరు ఒక్కో భంగిమలో పడుకుంటారు. కొంతమంది నిద్రపోయే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అలవాటు ఉంటుంది. కొందరు బోర్లా పడుకొంటే, మరికొందరు వెల్లకిలా, ఇంకొదరు పక్కకి తిరిగి పడుకొంటారు. ఎసిడిటీతో బాధపడేవారు పడుకొనే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.